గోపీచంద్ పెద్ద రిస్క్ చేస్తున్నాడేమో .. డిజాస్టర్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ?

Published : Sep 03, 2023, 01:30 PM IST
గోపీచంద్ పెద్ద రిస్క్ చేస్తున్నాడేమో .. డిజాస్టర్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ?

సారాంశం

శ్రీనువైట్ల పేరు చెప్పగానే ఢీ, రెడీ, దూకుడు, దుబాయ్ శ్రీను, బాద్షా లాంటి సూపర్  హిట్ చిత్రాలు గుర్తుకు వస్తాయి.

శ్రీనువైట్ల పేరు చెప్పగానే ఢీ, రెడీ, దూకుడు, దుబాయ్ శ్రీను, బాద్షా లాంటి సూపర్  హిట్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఒక ఫన్నీ ఫ్యామిలీ డ్రామా చుట్టూ యాక్షన్, లవ్ అంశాలు జోడించడం శ్రీనువైట్ల శైలి. శ్రీనువైట్ల హిట్ చిత్రాలన్నింటిలోనూ ఇదే ఫార్ములా ఉంటుంది. 

కానీ ఆగడు చిత్రం నుంచి శ్రీను వైట్లకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది.  శ్రీను వైట్ల తెరకెక్కించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశ పరిచాయి. రవితేజతో చివరగా తెరకెక్కించిన అమర్ అక్బర్ ఆంటోని తర్వాత శ్రీనువైట్ల తో సినిమా చేసేందుకు ఏ హీరో కూడా ముందుకు రావడం లేదు. 

శ్రీనువైట్ల మూస కథల నుంచి బయటకి రాలేకున్నారు అనే విమర్శ ఉంది. అయితే మంచు విష్ణుతో ఢీ 2 తెరకెక్కించేలానే ఆలోచన ఉండేది. కానీ ఆ చిత్రం ప్రారంభం కాకుండానే అటకెక్కింది. ఈ నేపథ్యంలో శ్రీనువైట్ల కి లైఫ్ ఇవ్వడానికి ఏ ఒక్క హీరో ముందుకు రావడం లేదు. అయితే టాలీవుడ్ లో ఆసక్తికర న్యూస్ వైరల్ గా మారింది. శ్రీను వైట్ల, యాక్షన్ హీరో గోపీచంద్ కాంబినేషన్ లో ఒక చిత్రం తెరకెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

గోపీచంద్ కూడా ప్రస్తుతం ఫ్లాపుల్లోనే ఉన్నాడు. చివరగా నటించిన రామబాణం చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ సమయంలో శ్రీనువైట్ల చెప్పిన పాయింట్ కి గోపీచంద్ కనెక్ట్ అయ్యాడట. దీనితో ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ చిత్రం గురించి అధికారిక సమాచారం ఎప్పుడు వెలువడుతుందో చూడాలి. అయితే శ్రీనువైట్లతో సినిమా అంటే గోపీచంద్ పెద్ద రిస్క్ చేస్తున్నట్లే అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఏం జరగబోతోందో చూడాలి. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి