
ప్రస్తుతం అన్ని భాషల్లోనూ సినిమాటిక్ యూనివర్స్‌ట్రెండ్ నడుస్తున్న సంగతి సినిమా లవర్స్ అందరికీ తెలిసిందే. ఒక సినిమాలోని కథ మరో సినిమాలోని కథతో కనెక్ట్ అవుతూ సినిమాటెక్ ప్రపంచంలో ఒకదానితో ఒకటి మిళితం అవుతూ ఆయా సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. హాలీవుడ్‌లో ఈ ట్రెండ్ బాగా వర్కవుట్ అయ్యింది. సూపర్ హీరోలు అందరూ కలిసి నటించిన సినిమాల గురించి తెలిసిందే. ఇప్పుడు ఇండియన్ సినిమా పరిశ్రమలో సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్ నడుస్తోంది. ఒక సినిమాకు మరొకటితో సంబంధం లేకుండా ఆ కథల ప్రపంచాన్నో, లేదంటే పాత్రల్నో కొనసాగిస్తూ సినిమాల్ని రూపొందిస్తున్నారు దర్శకులు. తాజాగా సుజీత్ సైతం ఆ సినిమాటిక్ యూనివర్స్ లోకి ప్రవేశించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న సినిమా 'ఓజీ' (OG Movie). ఆయన అభిమాని సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.నిన్న పవన్ పుట్టినరోజు సందర్భంగా వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. అభిమానులకు ఆ టీజర్ విపరీతంగా నచ్చింది. ముఖ్యంగా పవన్ స్టయిలిష్ లుక్, ఆ స్లీక్ యాక్షన్ సీక్వెన్సులు నచ్చాయి. ఈ గ్లింప్స్ లో తో సినిమాటిక్ యూనివర్స్ లోకి ఓజీ ప్రవేశించినట్లు క్లూ ఇచ్చే సారు సుజీత్.
ఈ 'ఓజీ' కంటే ముందు సుజీత్ దర్శకత్వం వహించిన సినిమా 'సాహో'. వాజీ సిటీలో ఆ కథ జరిగినట్లు చూపించారు. ఆ వాజీ సిటీకి, ముంబైలో ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌కు 'ఓజీ' కు సంబంధం ఉంటుందని అర్దమవుతోంది. అంటే ఇది సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పేసాడు! ఇప్పుడీ 'ఓజీ' వీడియోలో 'వాజీ ఇంపోర్ట్స్ & ఎక్స్పోర్ట్స్' అని బోర్డు చూపించారు. దాని ముందు ఫైట్ జరిగినట్లు హింట్ ఇచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఒక్క షాట్ ఈ మేటర్ తో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇక గ్లింప్స్ తో మాఫియా, రౌడీలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌లో వేసేంత పవర్ పోలీసుకు ఉంది. ఖాకీ చొక్కాలో అంత హీరోయిజం ఉంటుంది. అటువంటి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మరీ ఒకరి చెయ్యి నరకాలంటే... ఆ వ్యక్తికి ఎంత పవర్ ఉండాలి? అంత పవర్ ఫుల్ మాఫియా నాయకుడిగా పవన్ కళ్యాణ్ పాత్రను సుజీత్ చూపించారు. పోలీస్ స్టేషన్ నుంచి పవన్ కళ్యాణ్ వెళ్ళేటప్పుడు కొన్ని ఫైల్స్ తీసుకు వెళుతున్నట్టు సీన్ ఉంది.