అలాంటి సినిమాలంటే రాంచరణ్ కి చాలా ఇబ్బంది, ఆ రెండు సీన్స్ చాలు.. శ్రీనివాస్ అవసరాల కామెంట్స్

Published : Mar 09, 2023, 06:40 PM IST
అలాంటి సినిమాలంటే రాంచరణ్ కి చాలా ఇబ్బంది, ఆ రెండు సీన్స్ చాలు.. శ్రీనివాస్ అవసరాల కామెంట్స్

సారాంశం

సున్నితమైన భావోద్వేగాలతో చిత్రాలు తెరకెక్కిస్తూ శ్రీనివాస్ అవసరాల టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు పొందారు. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా శ్రీనివాస్ అవసరాల తన ప్రతిభ చాటుతున్నారు. 

సున్నితమైన భావోద్వేగాలతో చిత్రాలు తెరకెక్కిస్తూ శ్రీనివాస్ అవసరాల టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు పొందారు. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా శ్రీనివాస్ అవసరాల తన ప్రతిభ చాటుతున్నారు. శ్రీనివాస్ అవసరాల తాజాగా తెరకెక్కించిన చిత్రం  ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' . నాగ శౌర్య , మాళవిక నాయర్ జంటగా నటించిన ఈ చిత్రం మార్చి 17న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా శ్రీనివాస్ అవసరాల ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. 

తాజాగా ఇంటర్వ్యూలో శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి, రాంచరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభిమానులతో సరదాగా ఇంటరాక్ట్ అయిన శ్రీనివాస్ అవసరాల వారడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఓ అభిమాని ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ వస్తుందా అని ప్రశ్నించారు. నా ఊహ ప్రకారం నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ వస్తుందనే అనిపిస్తోంది అని శ్రీనివాస్ అవసరాల అన్నారు. 

ఒక వేళ నాటు నాటు కి ఆస్కార్ వస్తే అది మనందరం సెలెబ్రేట్ చేసుకునే రోజు అవుతుంది అని శ్రీనివాస్ అన్నారు. ఓ అభిమాని ఆరెంజ్ చిత్రాన్ని గుర్తు చేస్తూ రాంచరణ్ గురించి ప్రశ్నించాడు. ఆరెంజ్ చిత్రంలో శ్రీనివాస్ అవసరాల కూడా నటించారు. రాంచరణ్ ని భవిష్యత్తులో డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందా అని అడగగా.. నిజంగా చెప్పాలంటే రంగస్థలం, ఆర్ఆర్ఆర్ చిత్రాల నటనతో నా ఇమాజినేషన్, అంచనాలు మొత్తం దాటేశారు. 

ఆర్ఆర్ఆర్ చిత్రంలో పోలీస్ అధికారులకి ప్రమోషన్స్ అనౌన్స్ చేసే సన్నివేశంలో.. ఎన్టీఆర్ ని కొరడాతో కొట్టే సన్నివేశంలో రాంచరణ్ నటన అద్భుతం. రాంచరణ్ తో సినిమా చేయాలి అంటే అంతకి మించి ఆలోచించాలి. రాంచరణ్ తో పర్సనల్ గా ఇంటరాక్ట్ అయినప్పుడు నాకు అర్థం అయింది. ఆయనకి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయడం ఇష్టం లేదు. అలాంటి చిత్రాల్లో నటించాల్సి వస్తే కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అయ్యేవారు. కానీ రంగస్థలం, ఆర్ఆర్ఆర్ చరణ్ నిజంగా కోరుకున్న చిత్రాలు అని శ్రీనివాస్ అవసరాల అన్నారు. 

ఇదిలా ఉండగా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి 'నీతో గడిచిన ఈ కాలం' అనే రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశారు. వినసొంపుగా ఉన్న ఈ సాంగ్ యువతని ఆకట్టుకునే విధంగా ఉంది. టిజి విశ్వప్రసాద్, పద్మజ దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సోదరుడు కళ్యాణి మాలిక్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్