
గత ఐదు సీజన్స్ లో ఎన్నడూ చూడని దారుణమైన రేటింగ్ సీజన్ 6 కి వస్తుంది. ఇప్పుడు కొంచెం మెరుగైందని వార్తలు వస్తున్నా... గతంలో యావరేజ్ గా 2-3 రేటింగ్ వచ్చిందట. దీనికి కేవలం కంటెస్టెంట్స్ ఆట తీరే కారణమని నిర్వాహకుల భావన. అందుకే హోస్ట్ నాగార్జున చేత రెండు వారాలు వరుసగా కోటింగ్ ఇప్పించారు. సరిగా ఆడని కంటెస్టెంట్స్ ని నాగార్జున ఉతికేశాడు. రేటింగ్ మెరుగయ్యాక, ఆయన కోప్పడడం తగ్గించారు.
కాగా నేడు మంగళవారం కావడంతో హౌస్లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ మొదలైంది. దీని కోసం సెలెబ్రిటీ గేమ్ అంటూ స్టార్ హీరోలు, హీరోయిన్స్ గెటప్స్ ఇంటి సభ్యులు ధరించాలి. సదరు గెటప్స్ లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలి. అయితే ఈ గేమ్ లో కంటెస్టెంట్స్ అందరూ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్ క్రియేట్ చేయలేకపోయారు. దీంతో బిగ్ బాస్ కి కోపం కట్టలు తెంచుకుంది. బిగ్ బాస్ షో చరిత్రలో ఈ టాస్క్ ఇంత వరస్ట్ గా చేసింది ఎన్నడూ లేదు.
ప్రతి సీజన్లో ఈ టాస్క్ కంటెస్టెంట్స్ చక్కగా పెర్ఫార్మ్ చేసేవారు. మీకు ఆటపై ఎలాంటి ఆసక్తి లేదని తేలిపోతుంది. షో పట్ల టాస్క్స్ పట్ల ఇంట్రెస్ట్ లేకపోతే మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఉంది, నేరుగా వెళ్లిపోండి. ఇక మీ కాస్ట్యూమ్స్ తీసేసి స్టోర్ రూమ్ లో పెట్టండి. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ రద్దు చేస్తున్నానని బిగ్ బాస్ చెప్పాడు. బిగ్ బాస్ స్టేట్మెంట్ ఇంటి సభ్యులకు షాక్ ఇచ్చింది. కొందరి కారణంగా అందరినీ శిక్షించ వద్దని వేడుకున్నారు. అదే సమయంలో గేమ్ ఆడని కంటెస్టెంట్స్ పై అసహనం వ్యక్తం చేశారు.