Bigg Boss 6 Telugu: సీజన్‌ ఫస్ట్ ఫైనలిస్ట్ శ్రీహాన్‌.. ఆనందంలో రేవంత్‌.. ఈ సీజన్‌ బెస్ట్, వరస్ట్ ఎవరంటే?

Published : Dec 03, 2022, 11:26 PM IST
Bigg Boss 6 Telugu: సీజన్‌ ఫస్ట్ ఫైనలిస్ట్ శ్రీహాన్‌.. ఆనందంలో రేవంత్‌.. ఈ సీజన్‌ బెస్ట్, వరస్ట్ ఎవరంటే?

సారాంశం

శనివారం ఎపిసోడ్‌లో మూడు మెయిన్‌ హైలైట్స్. ఒకటి ఫైనల్‌లోకి ఎంట్రీ ప్రారంభమైంది. రెండో బెస్ట్, వరస్ట్ కెప్టెన్‌ ఎవరో తేలిపోయింది. కూతురిని చూసి మురిసిపోయాడు రేవంత్‌.

బిగ్‌ బాస్‌ 6 తెలుగు 13వ వారం ముగింపు చేరుకుంది. శనివారం ఎపిసోడ్‌లో ప్రధానంగా మూడు ఆసక్తికర విషయాలను చోటు చేసుకున్నాయి. ఒకటి ఫైనల్‌లోకి ఎంట్రీ ప్రారంభమైంది. రెండో బెస్ట్, వరస్ట్ కెప్టెన్‌ ఎవరో తేలిపోయింది. కూతురిని చూసి మురిసిపోయాడు రేవంత్‌. దీంతో శనివారం ఎపిసోడ్‌ ఆద్యంతం ఎంటర్టైనింగ్‌గా, రసవత్తరంగా సాగింది. 

మొదట టికెట్‌ టూ ఫినాలేలో ఫైనల్‌ రౌండ్‌ రేవంత్‌, శ్రీహాన్‌ మధ్య సాగింది. తాడుని ఎక్కువ సేపు ఎవరైతే ఊపుతూనే ఉంటారో వాళ్లు విన్నర్‌. ఇందులో రేవంత్‌ డ్రాప్‌ కావడంతో శ్రీహాన్‌ విన్నర్ అయ్యారు. ఆరో సీజన్‌ షోలో ఫైనల్‌కి చేరి తొలి కంటెస్టెంట్‌గా నిలిచారు. అనంతరం ఫేస్‌లకు క్రీమ్‌ పెట్టుకుని ఇంటి సభ్యులు డక్‌ లాగా ఇమిటేట్ చేసిన తీరు నవ్వులు పూయించింది. హైలైట్‌గా నిలిచింది. అనంతరం ఎంట్రీ ఇచ్చిన నాగార్జున సైతం ఆ ఆటని అభినందిస్తూ మరోసారి వాళ్లకి చూపించారు. 

ఈ సందర్భంగా కూతురు పుట్టిన రేవంత్‌కి, ఫైనల్‌లోకి అడుగుపెట్టిన శ్రీహాన్‌కి అభినందనలు తెలిపారు నాగార్జున. అనంతరం ఇంటి సభ్యులకు క్లాస్‌ పీకడాలు, ప్రశ్నలకు క్లారిటీలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ సీజన్‌లో ఏ వారంలో రిగ్రెట్‌(విచారం) ఫీలవుతున్నారో తెలిపాలన్నారు నాగ్‌. ఫైమా ఆరో వారంలో సుధీప విషయంలో ఎటకారం చేసిన దానికి రిగ్రెట్‌ ఫీలయ్యానని తెలిపింది. ఇనయ.. తొమ్మిదో వారంలో ఎక్కువ మాటలు అన్నానని, అందుకు బాధగా ఉందని తెలిపింది. శ్రీహాన్‌ 12వ వారంలో ఫ్యామిలీ మెంబర్స్ వచ్చాక కొన్ని విషయాల్లో రిగ్రెట్ అయ్యానని చెప్పాడు. కీర్తి విషయంలో ఈగో అంటూ మరోసారి రచ్చ చేశాడు.

కీర్తి ఈ వారంలో బ్రిక్స్ ని తన్నడం, ఆ గేమ్‌ విషయంలో తాను రిగ్రెట్‌గా ఫీలవుతున్నానని చెప్పింది. రేవంత్‌ 1 నుంచి 6 వారాల వరకు బూతులు, కోపం, 8వ వారంలో చేపల టాస్క్ లో, 9వ వారంలో ఆదిరెడ్డి విషయంలో, 13వ వారంలో తాను రిగ్రెట్ ఫీలయ్యాననితెలిపాడు. రోహిత్‌ 12వ వారంలో కెప్టెన్సీ టాస్క్ లో రిగ్రెట్‌ అయ్యానని చెప్పారు. శ్రీ సత్య 2 వారం, 11 వారం రిగ్రెట్‌ అయ్యానని,  ఆదిరెడ్డి రెండో వారం, తొమ్మిదో వారం, 11 వారం రిగ్రెట్‌ అయినట్టు చెప్పాడు.

అనంతరం ఈ సీజన్‌ బెస్ట్ కెప్టెన్‌, వరస్ట్ కెప్టెన్‌ ఎవరో చెప్పాల్సిన టాస్క్ లో బెస్ట్ కెప్టెన్‌ కీర్తి అని, వరస్ట్ కెప్టెన్ ఆదిరెడ్డి అని రోహిత్‌ చెప్పారు. బెస్ట్ కెప్టెన్‌ ఇనయ అని, వరస్ట్ శ్రీ సత్య అని ఆదిరెడ్డి తెలిపారు. ఇనయ బెస్ట్ కెప్టెన్‌ అని, ఆదిరెడ్డి వరస్ట్ అని శ్రీసత్య తెలిపింది. శ్రీ సత్య బెస్ట్ అని, శ్రీహాన్‌ వరస్ట్ అని ఇనయ చెప్పింది. ఇనయ బెస్ట్ అని , ఆదిరెడ్డి వరస్ట్ అని శ్రీహాన్‌ వెల్లడించారు. ఆదిరెడ్డి బెస్ట్ అని, ఇనయ వరస్ట్ అని రేవంత్‌, ఇనయ బెస్ట్ అని, రేవంత్‌ వరస్ట్ అని ఫైమా, ఫైమా బెస్ట్ అని, శ్రీహాన్‌ వరస్ట్ కెప్టెన్‌ అని కీర్తి తెలిపారు. ఇందులో ఎక్కువ ఓట్లు వచ్చిన ఇనయ బెస్ట్ కెప్టెన్ కాగా, ఆదిరెడ్డి వరస్ట్ కెప్టెన్‌ అయ్యారు. 

అనంతరం రేవంత్ కి తన కూతురుని చూపించారు నాగ్‌. ఆసుపత్రిలో బెడ్‌పై ఉన్న తన భార్యని, కూతురుని చూపించడంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు రేవంత్‌. ఆనందంలో ఉప్పొంగిపోయాడు. ఎమోషన్స్ ని కంట్రోల్‌ చేసుకున్నాడు. ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ సందర్భంగా `పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా..` అనే పాట పాడి ఆ మరింత స్వీట్ మూవ్‌మెంట్‌గా మార్చాడు. ఇక ఈ శనివారం ఎపిసోడ్‌లో రోహిత్‌, కీర్తి సేవ్‌ అయ్యారు. ఫైమా, రేవంత్‌, శ్రీ సత్య, ఆదిరెడ్డి ఇంకా నామినేషన్స్‌ లో ఉన్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Venu Swamy: అయ్యో, వేణు స్వామి పూజ వృధాగా పోయిందిగా.. అఖండ 2 వాయిదాతో మరోసారి ట్రోలింగ్
Krishna కథ వినకుండా మహేష్ బాబు చేసిన డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?