మహేష్‌ బ్యాక్‌ టూ వర్క్.. ఆ బాధ నుంచి తేరుకుని షూటింగ్‌లోకి..

Published : Dec 03, 2022, 07:20 PM IST
మహేష్‌ బ్యాక్‌ టూ వర్క్.. ఆ బాధ నుంచి తేరుకుని షూటింగ్‌లోకి..

సారాంశం

మహేష్‌ ఆ బాధ నుంచి కోలుకోవడంతోపాటు, బాధని మర్చిపోయేందుకు వర్క్ లో బిజీ అవుతున్నారు. తాజాగా మహేష్ షూటింగ్‌లోకి అడుగుపెట్టారు.

సూపర్‌ స్టార్‌ మహేష్‌ని ఈ ఏడాది వరుస విషాదాలు వెంటాడిని విషయం తెలిసిందే. తన అన్నయ్య రమేష్‌బాబు, ఆ తర్వాత అమ్మ ఇందిరా దేవి, ఇటీవల సూపర్ స్టార్‌ కృష్ణ మరణంతో తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు. ఓ రకంగా ఈ ఏడాది ఆయన్ని తీవ్రంగా కుంగదీసిందని చెప్పొచ్చు. జీవితంలో ఆయన బిగ్గెస్ట్ లాస్‌. దీంతో మహేష్‌ ఫ్యామిలీతోపాటు ఆయన తీరని బాధలో ఉన్నారు. అయితే ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. 

మహేష్‌ ఆ బాధ నుంచి కోలుకోవడంతోపాటు, బాధని మర్చిపోయేందుకు వర్క్ లో బిజీ అవుతున్నారు. తాజాగా మహేష్ షూటింగ్‌లోకి అడుగుపెట్టారు. బ్యాక్‌ టూ సెట్‌తో బ్యాక్‌ టూ వర్క్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. శనివారం మహేష్‌ ఓ యాడ్‌ షూట్‌లో పాల్గొన్నారు. ప్రముఖ కూల్‌ డ్రింక్‌ బ్రాండ్‌ యాడ్‌ షూటింగ్‌లో మహేష్‌ పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. యాడ్‌ షూట్‌లో తీసిన తన ఫోటోని పంచుకున్నారు మహేష్‌. ఇందులో అత్యంత స్టయిలీష్‌గా ఉన్నారు. అంతేకాదు చాలా పవర్‌ఫుల్‌గానూ ఉంది. ఇది ఇప్పుడు వైరల్‌ అవుతుంది. 

ఇదిలా ఉంటే మహేష్‌ త్వరలోనే త్రివిక్రమ్‌తో చేయబోతున్న సినిమాని కూడా స్టార్ట్ చేయబోతున్నారని సమాచారం. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీలీలా సెకండ్‌ హీరోయిన్‌గా కనిపించబోతుందట. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్నాతో ఐటెమ్ సాంగ్‌ ప్లాన్‌ చేస్తున్నారట. ఈ సినిమా అనంతరం రాజమౌళితో మహేష్‌ ఓ వరల్డ్ అడ్వెంచరస్‌ మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇది వచ్చే ఏడాది మే,జూన్‌లో ప్రారంభం కానుందట. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Long Delayed Movies: చిరంజీవి నుంచి నాగ చైతన్య వరకు.. లాంగ్ డిలే వల్ల అడ్రస్ లేకుండా పోయిన 8 సినిమాలు ఇవే
Akhanda 2 Release ఆగిపోవడానికి అసలు కారణం ఇదే ? బాలయ్య నెక్ట్స్ ఏం చేయబోతున్నాడు?