శ్రీదేవిది హత్యే : సుబ్రహ్మణ్య స్వామి

Published : Feb 27, 2018, 11:50 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
శ్రీదేవిది హత్యే : సుబ్రహ్మణ్య స్వామి

సారాంశం

శ్రీదేవి మృతిపై బీజేపీ ఎంపీ సుబ్రహ్యణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు శ్రీదేవి బాత్ టబ్ లో పడి చనిపోయే ప్రశ్నే లేదన్న స్వామి ముమ్మాటికీ శ్రీదేవిని హత్య చేసి వుంటారన్న స్వామి

ప్రముఖ నటి శ్రీదేవి ఆకస్మిక మరణం,  దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలో బీజేపీ సీనియర్‌ నేత, ప్రముఖ న్యాయవాది కూడా అయిన సుబ్రహ్యణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవికి మద్యం సేవించే అలవాటు లేదంటూ ..దుబాయ్‌ ఫోరెన్సిక్‌ రిపోర్టులో వెల్లడైన అంశాలపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. డాక్టర్లు  అకస్మాత్తుగా మీడియా ముందుకు వచ్చి గుండెపోటుతో చనిపోయారని ప్రకటించారని.. ఈ నేపథ్యంలో ఆమెతో బలంగా మద్యం సేవించారా అనేది తేలాలన్నారు. శ్రీదేవిని హత్య చేశారనే అనుమానం తనకు కలుగుతోందంటూ  పెను సంచలనానికి తెర తీసారు.

 

ఈ మొత్తం  వ్యవహారంలో సీసీటీవీ ఫుటేజీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. గుండెపోటుతో చనిపోయారని ప్రకటించడం ముందస్తు వ్యూహంలో భాగంగానే జరిగిందని భావిస్తున్నానన్నారు.  అంతేకాదు సినీతారలకు దావూద్‌కు సంబంధాలున్నాయనీ.. ఈ వైపుగా దృష్టి కేంద్రీకరించాలంటూ స్వామి కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అలాగే మీడియాలో వస్తున్న విషయాలు గందరగోళంగా వున్నాయన్నారు. మీడియా సంయమనం పాటించాలని ప్రాసిక్యూషన్‌  విషయాలను ప్రకటించే దాకా  వేచి వుండాలని సుబ్రహ్యణ్యస్వామి పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

చనిపోయే ముందు శ్రీదేవి నన్ను కలిసింది.. అప్పుడు అందరం కలిసి గెట్ టుగెదర్.!
Ram Charan Peddi Movie: మైండ్ బ్లాక్ అయ్యే సన్నివేశాలతో 'పెద్ది' ఢిల్లీ షెడ్యూల్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే