ప్రకాశ్ రాజ్ వాయిస్ ఓవర్ తో శ్రీదేవి "మామ్" చిత్రం టీజర్

Published : Apr 15, 2017, 01:44 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
ప్రకాశ్ రాజ్ వాయిస్ ఓవర్ తో శ్రీదేవి "మామ్" చిత్రం టీజర్

సారాంశం

ప్రకాశ్ రాజ్ వాయిస్ ఓవర్ తో శ్రీదేవి "మామ్" చిత్రం టీజర్

ఆల్‌ ఇండియా స్టార్‌ శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్‌ దర్శకత్వంలో మ్యాడ్‌ ఫిలింస్‌, థర్డ్‌ ఐ పిక్చర్స్‌ పతాకాలపై నిర్మాణం జరుపుకుంటున్న విభిన్న కథా చిత్రం 'మామ్‌'. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు మోషన్‌ పోస్టర్‌ను ఈరోజు విడుదల చేశారు. విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌ వాయిస్‌ ఓవర్‌తో డిఫరెంట్‌గా, అందర్నీ ఆకట్టుకునే విధంగా ఈ మోషన్‌ పోస్టర్‌ రూపొందింది. ఇంగ్లీష్‌ వింగ్లీష్‌ తర్వాత శ్రీదేవి నటిస్తున్న మరో మంచి చిత్రం 'మామ్‌'. ఆస్కార్‌ అవార్డ్స్‌ విజేత ఎ.ఆర్‌.రెహమాన్‌ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జూలై 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

ఆల్‌ ఇండియా స్టార్‌ శ్రీదేవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంలో అక్షయ్‌ ఖన్నా, అభిమన్యు సింగ్‌, సజల్‌ ఆలీ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, సినిమాటోగ్రఫీ: అనయ్‌ గోస్వామి, ఎడిటింగ్‌: మోనిసా బల్‌ద్వా, కథ: రవి ఉద్యవార్‌, గిరీష్‌ కోహ్లి, కోన వెంకట్‌, స్క్రీన్‌ప్లే: గిరీష్‌ కోహ్లి, నిర్మాతలు: బోనీ కపూర్‌, సునీల్‌ మన్‌చందా, నరేష్‌ అగర్వాల్‌, ముఖేష్‌ తల్‌రేజా, గౌతమ్‌ జైన్‌, దర్శకత్వం: రవి ఉద్యవార్‌. 

PREV
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు