'మామ్‌' సెన్సార్‌ పూర్తి - జూలై 7 విడుదల

Published : Jun 28, 2017, 08:12 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
'మామ్‌' సెన్సార్‌ పూర్తి - జూలై 7 విడుదల

సారాంశం

చాలా గ్యాప్ తర్వాత అతిలోక సుందరి నటించిన చిత్రం మామ్ సెన్సార్ బోర్డు క్లియరెన్స్ పొందిన మామ్ చిత్రం విడుదల తేదీ జులై 7గా ఖరారు చేసుకున్న శ్రీదేవి మామ్ చిత్రం

ఆల్‌ ఇండియా స్టార్‌ శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్‌ దర్శకత్వంలో మ్యాడ్‌ ఫిలింస్‌, థర్డ్‌ ఐ పిక్చర్స్‌ పతాకాలపై 'మామ్‌' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని ఎలాంటి కట్స్‌ లేకుండా యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. సినిమా చూసిన సెన్సార్‌ సభ్యులు చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. సెన్సార్‌ బోర్డ్‌ ఛీఫ్‌ పహ్లజ్‌ నిహ్లాని 'మామ్‌' చూసి తను పొందిన అనుభూతిని తెలియజేస్తూ.. ఈ చిత్రాన్ని న్యూ ఏజ్‌ మదర్‌ ఇండియాగా చెప్పొచ్చు. ఇందులో శ్రీదేవి అభినయం నర్గీస్‌ను గుర్తు తెచ్చింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ క్లైమాక్స్‌లో కంటతడి పెట్టాల్సిందేనని సెన్సార్‌ సభ్యులు అన్నారు. మంచి కథ, కథనాలతో రవి ఉద్యవర్‌ ఈ చిత్రాన్ని ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా రూపొందించారని, శ్రీదేవి నటన ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్‌ అని ప్రశంసించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూలై 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. 

ఆల్‌ ఇండియా స్టార్‌ శ్రీదేవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంలో అక్షయ్‌ ఖన్నా, అభిమన్యు సింగ్‌, సజల్‌ ఆలీ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. 

ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, సినిమాటోగ్రఫీ: అనయ్‌ గోస్వామి, ఎడిటింగ్‌: మోనిసా బల్‌ద్వా, కథ: రవి ఉద్యవార్‌, గిరీష్‌ కోహ్లి, కోన వెంకట్‌, స్క్రీన్‌ప్లే: గిరీష్‌ కోహ్లి, నిర్మాతలు: బోనీ కపూర్‌, సునీల్‌ మన్‌చందా, నరేష్‌ అగర్వాల్‌, ముఖేష్‌ తల్‌రేజా, గౌతమ్‌ జైన్‌, దర్శకత్వం: రవి ఉద్యవార్‌ 

PREV
click me!

Recommended Stories

బాలయ్యతో చేసిన ఆ సినిమా నా కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ హీరోయిన్
విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్