ఓసారి శిరీషను రవితేజ తమ్ముడు భరత్ లేపుకొచ్చాడన్న పోసాని

Published : Jun 28, 2017, 06:48 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
ఓసారి శిరీషను రవితేజ తమ్ముడు భరత్ లేపుకొచ్చాడన్న పోసాని

సారాంశం

రవితేజ సోదరుడు భరత్ పై కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించిన  పోసాని కృష్ణ మురళి పోసానితో  బతికున్నప్పుడు అత్యంత సాన్నిహిత్యంతో మెలిగిన భరత్ రవితేజ కూడా భరత్ మంచి వాడే కానీ ఏం లాభం అనేవాడన్న పోసాని

సినీ నటుడు, రవితేజ సోదరుడు భరత్ మృతి తర్వాత కుటుంబ సభ్యులు సహా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారెవరూ అతనికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడలేదు. అయితే.. భరత్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన పోసాని కృష్ణ మురళి తాజాగా భరత్ పెళ్లికి సంబంధించి కొన్ని విషయాలు వెల్లడించారు.

 

గతంలో తాను పరుచూరి గోపాల కృష్ణ గారి దగ్గర పని చేసేవాన్నని, అప్పుడు ఓ సారి భరత్ ఫోన్ చేసి నేని ఒకమ్మాయిని గాఢంగా ప్రేమించానని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని లేపుకొచ్చాడని పోసాని అన్నారు. తాను వాళ్లిద్దరితో మాట్లాడి.. తన గది వాళ్లకిచ్చానని, అయితే అది గిట్టని వాడొకడు పోసాని అమ్మాయిని తీసుకొచ్చారని చెప్పడంతో... గోపాలకృష్ణ గారి కుటుంబం తన నాలుగున్నరేళ్ల నమ్మకాన్ని ఒక్క సారిగా కోల్పోయి తనను వద్దన్నారని పోసాని తెలిపారు. అప్పుడు భరత్ పెళ్లి కూడా చేశామని, ఆ అమ్మాయి పేరు శిరీష అని, ఆ అమ్మాయి భరత్ తో పెళ్లి తర్వాత నాలుగేళ్ల వరకు కలిసున్నట్లు తనకు తెలుసని పోసాని అన్నారు.

ఇక భరత్ తాగుతాడు.. డ్రగ్స్.. అంటూ మీడియాలో వచ్చిన కథనాలు తనకు తెలుసని, అయినా వ్యక్తిగతంగా తనతో ఉన్న అనుబంధం వల్ల ఫోన్ లో తరచూ మాట్లాడుతూ ఉండేవాడినని పోసాని అన్నారు. అప్పుడప్పుడు భరత్ మందు తాగి ఫోన్ చేసే వాడు. రవితేజ కంటే నాకెక్కువ దగ్గర. అన్నా తాగున్నా. ఫోన్ చేసా. మాట్లాడొచ్చంటే మాట్లాడుతా అనేవాడు. అప్పుడు నేను ఎందుకు తాగావని అడగలా. నాకు ఎప్పుడూ క్లాస్ పీకాలని అనిపించలేదు. భరత్ మంచివాడు. కొన్ని చెడు అలవాట్లు ఉండేవి. కానీ ఇటీవల దూరమయ్యాడనుకుంటున్నా.

ఓసారి లక్డీకాపూల్ సెంట్రల్ కోర్ట్ హోటల్ దగ్గర నేనున్నా. అప్పుడు కారులో తన ఫ్రెండ్స్ తో వెళ్తున్న భరత్ అమాంతం వచ్చి కౌగిలించుకుని.. ఐదు నిమిషాలు వదల్లేదని పోసాని అన్నారు. అన్నా.. నేను నీకు చెప్పుకోవడానికే ఫోన్ చేస్తా. హెల్ప్ కోసం చేయను. దయచేసి నా ఫోన్ ఎవాయిడ్ చేయొద్దు అన్నాడని పోసాని గుర్తు చేసుకున్నారు.

ఇక సోదరుని అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు హాజరు కాకపోవడంపై పోసాని చెప్పిన విషయాలు.. రవితేజ గురించి  తనకు తెలియదని, అయితే.. తన కుటుంబంలో తన మేనమామ చనిపోయినా కూడా.. తన చెడు కోరుకునే వాడు కాబట్టి..అతను చచ్చినా వెళ్లలేదని పోసాని తెలిపారు.

ఇక రవితేజ కుటుంబానికి సంబంధించి భరత్ ఎప్పుడూ తనతో ఏమీ చెప్పలేదని పోసాని అన్నారు. అయితే... భరత్ ఫోన్ చేసి మాట్లాడాడని రవితేజతో చెప్పినప్పుడు రవితేజ తనతో భరత్ మంచోడే కానీ ఉపయోగం ఏంటి. ఎదిగినోడు. నేను కొట్టి చెప్పటానికి కూడా లేదు. ఒకసారి రెండుసార్లయితే నేను ఇన్వాల్వ్ కాగలను కానీ.. ఎన్ని సార్లు చెప్పినా ఇలా పదేపదే తప్పు చేస్తాడు. నేను ఏం కావాలన్నా ఇస్తా కదా. అలా డ్రగ్స్ ఏంటి అని రవితేజ అన్నాడని.. పోసాని స్పష్టం చేశారు.

ఇక భరత్ అంత్య క్రియలకు కుటుంబ సభ్యులు ఎందుకు వెళ్లలేదో చెప్పడం కష్టమని పోసాని అన్నారు. ఎందుకు వెళ్లలేదో కుటుంబసభ్యులకే తెలియాలన్నారు. అయితే... బాధతో వెళ్లకపోవడం కూడా కారణం కావచ్చని పోసాని అన్నారు. కానీ... అది వారి కుటుంబ వ్యవహారం కాబట్టి తానేమీ మాట్లాడలేనని పోసాని స్పష్టం చేశారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌