దుబయి పోలీసుల అదుపులో బోనీకపూర్

Published : Feb 26, 2018, 06:59 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
దుబయి పోలీసుల అదుపులో బోనీకపూర్

సారాంశం

దుబయిలో శ్రీదేవి అనుమానాస్పద మృతి శ్రీదేవి మృతిపై కొనసాగుతున్న విచారణ దుబయి పోలీసుల అదుపులో బోనీ కపూర్, హోటల్ సిబ్బంది

అందాల తార శ్రీదేవి దుబయిలోని జుమైరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్ గదిలో హఠాన్మరణం పాలైన సంగతి తెలిసిందే. అయితే దుబయి సర్కారు ఆరోగ్య శాఖ ప్రమాదవశాత్తు శ్రీదేవి మరణించిందని నివేదిక ఇచ్చింది. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం ఆరోగ్యవంతమైన మహిళ టబ్ లో మునిగి చనిపోవటమేంటని, దాన్ని అధికారికంగా ఎలా నిర్థారించారని ప్రాసిక్యూషన్ వారు ప్రశ్నిస్తున్నారు.

 

ముందు గుండెపోటుతో చనిపోయిందంటూ చెప్పిన కుటుంబ సభ్యులు ఇప్పుడు రిపోర్టులో ఆల్కహాల్ వుందంటూ రావటం, టబ్ లో ప్రమాదవశాత్తు మునిగిపోయిందంటూ రిపోర్ట్ రావటం ఇలా... రకరకాల కోణాల్లో ప్రశ్నలు తలెత్తుతుండటంతో కేసు విచారణ తీవ్రమైంది.

 

శ్రీదేవిది ప్రమాదమా... ఆత్మ హత్యా.. లేక కుట్ర కోణమా అనేది అర్థం కాని సందిగ్దత నెలకొంది. ఈ నేపథ్యంలో విచారణ ముమ్మరమైంది. భారతీయ సినీ పరిశ్రమల వర్గాలను, దేశంలోని కోట్లాది మంది అభిమానులను తొలుస్తున్న శ్రీదేవి మృతి ప్రశ్న ఇప్పుడు ఇలా ట్విస్ట్ లు ఇస్తుండటం ఉత్కంఠ రేపుతోంది. 

 

శ్రీదేవి మృతి కేసును సీరియస్ గా తీసుకున్న దుబయి ప్రాసిక్యూషన్ కేసు విచారణ ముమ్మరం చేసింది. విచారణ పూర్తయే వరకు బోనీ కపూర్ దుబయి విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. ప్రస్థుతం పోలీసుల అదుపులో బోనీకపూర్ తోపాటు హోటల్ సిబ్బంది కూడా విచారణ ఎదుర్కొంటున్నారు.

PREV
click me!

Recommended Stories

Savitri: మహానటి సావిత్రి విలన్‌ రోల్‌ చేసిన తొలి చిత్రం ఏంటో తెలుసా? ఏకంగా ఎన్టీఆర్‌నే లేపుకుపోయింది
4000 కు ప్లేట్ భోజనం, సెలబ్రిటీల 10 కాస్ట్లీ రెస్టారెంట్లు, వాటిలో తినడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా?