అందరూ ఆమెకు నచ్చిన డ్రస్ లోనే.. అంత్యక్రియలకు

Published : Feb 26, 2018, 04:23 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
అందరూ ఆమెకు నచ్చిన డ్రస్ లోనే.. అంత్యక్రియలకు

సారాంశం

శ్రీదేవి అంత్యక్రియల్లో తెలుపు రంగు తప్ప మరే రంగు కూడా కనిపించకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వైట్ థీమ్‌తో అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.​

అందాల నటి శ్రీదేవి హఠాన్మరణం యావత్ భారత దేశాన్ని కలచి వేసింది. మొన్నటిదాకా మన మధ్యే ఉంది ఇంత అకస్మాత్తుగా ఆమె మరణించడం ఎవరు సహించలేకపోతున్నారు. దీంతో ఆమె భౌతిక కాయం సోమవారం రాత్రికి ముంబై చేరే అవకాశం కనిపిస్తోంది. మంగళవారం ఉదయం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. శ్రీదేవి అంత్యక్రియల్లో తెలుపు రంగు తప్ప మరే రంగు కూడా కనిపించకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.శ్రీదేవికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం. ఆమె ధరించే దుస్తువుల విషయంలో అయినా, మరే విషయంలో అయినా దానికే ఎక్కువ ప్రధాన్యత ఇస్తారట. దీంతో వైట్ థీమ్‌తో అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.అంత్యక్రియల్లో వాడే ఫ్లవర్స్, ఇతర వస్తువులు తెలుపు రంగులోనే ఉండేట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి కూడా తెలుపు రంగు దుస్తుల్లోనే హాజరుకావాలని సూచనలు చేసినట్లు సమాచారం.
శ్రీదేవి అంత్య క్రియల్లో ఆమెకు ఇష్టమైన వస్తువులు, రంగులకు ప్రధాన్యం ఇస్తూ నిర్వహిస్తారని, ఆమె ఆత్మకు శాంతి చేకూరే విధంగా అంతిమ సంస్కారాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.మంగళవారం సాయంత్రం శ్రీదేవి అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. మరికొన్ని గంటల్లో ఈ విషయమై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు