శ్రీ విష్ణు తో గీతా ఆర్ట్స్ సినిమా, డైరక్టర్ ఎవరంటే..?

Published : Jul 23, 2019, 05:12 PM IST
శ్రీ విష్ణు తో  గీతా ఆర్ట్స్ సినిమా, డైరక్టర్ ఎవరంటే..?

సారాంశం

ప్ర‌స్తుతం మంచి ఫామ్‌లో ఉన్న శ్రీ విష్ణు రీసెంట్ గా  న‌టించిన చిత్రం 'బ్రోచేవారెవ‌రురా' సక్సెస్ కావడంతో శ్రీవిష్ణు నెక్ట్స్ ఏ డైరక్టర్ తో చేయబోతున్నాడనేది చర్చనీయాంశంగా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం గీతాఆర్ట్స్ వారి GA2 పిక్చర్స్ బ్యానర్ పై ఓ సినిమా కమిటైనట్లు సమాచారం.

 

మెంట‌ల్ మ‌దిలో, నీది నాదీ ఒక‌టే క‌థ, అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు చిత్రాల‌తో మంచి న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీ విష్ణు. ప్ర‌స్తుతం మంచి ఫామ్‌లో ఉన్న శ్రీ విష్ణు రీసెంట్ గా  న‌టించిన చిత్రం బ్రోచేవారెవ‌రురా. ఈ చిత్రం సైతం భాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. దాంతో మంచి ఫామ్ లో ఉన్న శ్రీవిష్ణు నెక్ట్స్ ఏ డైరక్టర్ తో చేయబోతున్నాడనేది చర్చనీయాంశంగా మారింది. 

అందుతున్న సమాచారం ప్రకారం గీతాఆర్ట్స్ వారి GA2 పిక్చర్స్ బ్యానర్ పై ఓ సినిమా కమిటైనట్లు సమాచారం. బన్ని వాసు ప్రొడ్యూస్ చేసే ఈ చిత్రాన్ని  పేపర్ బోయ్ చిత్రం దర్శకుడు జయ శంకర్ డైరక్ట్ చేయనున్నారని వినికిడి.  ఇప్పటికే స్క్రిప్టు వర్క్ ఫినిష్ చేసి ప్రీ ప్రొడక్షన్ పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఇంకా అఫిషియల్ గా ప్రకటన అయితే ఇంకా ఏదీ రాలేదు. 

ఇది కాకుండా కృష్ణ విజయ్ ఎల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న " 'తిప్పరా మీసం' అనే చిత్రంలో శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటిదాకా సాఫ్ట్ మరియు లవర్ బాయ్ పాత్రలో కనిపించిన శ్రీ విష్ణు ఇప్పుడు సరికొత్త లుక్ తో కనిపించనున్నాడు. కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రం లో గుబురు గడ్డంతో పెద్ద పెద్ద మీసాలతో శ్రీ విష్ణు ఈ సినిమాలో కొత్త గా కనిపిస్తున్నాడు. 

రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ మరియు కృష్ణ విజయ ప్రొడక్షన్స్ బ్యానర్ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ ఓం సినిమా సమర్పణలో ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. శ్రీ విష్ణు లుక్ లాగానే సినిమా కథ కూడా చాలా కొత్తగా ఉంటుందని చెప్తున్నారు. రోహిణి, రఘుబాబు, అచ్చుత్ రామారావు, ఏ.ఎస్.రవికుమార్ చౌదరి, అజయ్ ఘోష్, రవి వర్మ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

హీరోలంతా లైన్‌ వేయడానికే అప్రోచ్‌ అవుతారని ఏకంగా స్టార్‌ హీరోని అవాయిడ్‌ చేసిన అనసూయ
జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?