బిగ్ బాస్ ని బ్యాన్ చేయాల్సిందే.. యాంకర్ పోరాటం!

By AN TeluguFirst Published Jul 23, 2019, 4:41 PM IST
Highlights

జర్నలిస్ట్ శ్వేతారెడ్డి బిగ్ బాస్ లోనూ కాస్టింగ్ కౌచ్ ఉందని ఆరోపణలు చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా షోలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. 

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ప్రసారాలను నిలిపివేసేంత వరకు తన పోరాటం ఆగదని జర్నలిస్ట్ శ్వేతారెడ్డి అన్నారు. సోమవారం నాడు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో నటి, యాంకర్ గాయత్రి గుప్తా పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్యతో కలిసి విలేకరులతో మట్లాడారు.

ఈ క్రమంలో బిగ్ బాస్ లోనూ కాస్టింగ్ కౌచ్ ఉందని ఆరోపణలు చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా షోలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. తాను చేస్తోన్న పోరాటాని ఇప్పటికే పలు సంఘాల మద్దతు లభించిందని.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హన్మంతరావు కూడా తన పోరాటాని మద్దతు తెలిపినట్లు చెప్పారు.

సినిమా రంగంలో ఎంతో గౌరవం ఉన్న అక్కినేని నాగార్జున ఈ షోకి హోస్ట్ గా వ్యవహరించడం కరెక్ట్ కాదని అన్నారు. తమిళ బిగ్ బాస్ ని కమల్ హాసన్ హోస్ట్చేయడం బాధాకరమైన విషయమని అన్నారు.

ప్రధాని మంత్రి నరేంద్రమోదీ ఈ నెల 24, 25 తేదీల్లో తమిళనాడుకి వస్తున్నారని, తమిళనాడుకి చెందిన సామాజిక కార్యకర్త రాజేశ్వరి ప్రియతో ప్రధానిని కలిసి.. 'బిగ్ బాస్'పై వినతిపత్రం సమర్పిస్తానని శ్వేతారెడ్డి తెలిపారు.

'బిగ్ బాస్'ని బ్యాన్ చేయాలని కోరుతూ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి నేతృత్వంలో హైకోర్టును ఆశ్రయించామని.. దీనిపై ఈ నెల 29న విచారణ జరగనుంది. 
  

click me!