
“తెలంగాణ అంటే కేసీఆర్ కు ఎంత ఇష్టమో? నువ్వు అంటే నాకు అంతే ఇష్టం” అని హీరోయిన్ తో హీరో చెప్పే డైలాగు కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంతకీ ఏ సినిమాలోది ఈ డైలాగు అంటారా..అక్కడికే వస్తున్నాం... కీరవాణి రెండో కుమారుడు శ్రీ సింహ కోడూరి హీరోగా నటిస్తున్న సినిమా 'భాగ్ సాలే'. ప్రణీత్ సాయి దర్శకత్వంలో వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ సినిమా పతాకాలపై అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కల్యాణ్ సింగనమల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలో విడుదలకు రెడీ అవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను తాజాగా చిత్ర టీమ్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ ఫుల్ ఫన్, యాక్షన్ సన్నివేశాలతో అలరిస్తోంది. ఈ ట్రైలర్ లోదే ఈ డైలాగు. మీరూ చూడండి ...
ఇక ఈ సినిమా మొత్తం కథ ఉంగరం వెనుకే తిరుగబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఇందులో ఒక ఉంగరం మెయిన్‌గా కనిపిస్తూ ఉంటుంది. ఇంతకీ ఆ ఉంగరం కథేంటో తెలియాలంటే త్వరలో విడుదల కానున్న సినిమా చూడాలి. ట్రైలర్ ప్రారంభమే.. జమిందారీ ఫ్యామిలీ గురించిఓ చెట్టు ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాడు వైవా హర్ష. ఆ తర్వాత హీరో శ్రీ సింహ చెఫ్ గా పని చేస్తుంటాడు. అతడిని హీరోయిన్ తన తండ్రికి రాయల్ ఫ్యామిలీకి చెందిన యువకుడిగా పరిచయం చేస్తుంది. పైసల కోసం కాయ కష్టం చేసే అతడిని బిజినెస్ మ్యాన్ అని చెప్తుంది.
“నీ మార్కెట్ క్యాప్ ఎంత?” అని హీరోయిన్ తండ్రి అడగడంతో “క్యాప్ ఎందుకు అంకుల్? జుట్టు బాగానే ఉందిగా” అని చెప్పే మాట ఫుల్ ఫన్నీగా అనిపిస్తుంది. ఫుడ్ అనేది ఎప్పుడూ రన్నింగ్ లో ఉండే బిజినెస్ అంటూ తల్లింద్రులకు చెప్తాడు హీరో. అందుకే తాను చెఫ్ గా మారినట్లు వివరిస్తాడు. “నేనంటే నీకు ఎంత ఇష్టం?” అని హీరోయిన్ అడిగిన ప్రశ్నకు, “తెలంగాణ అంటే కేసీఆర్ కు ఎంత ఇష్టమో? నువ్వు అంటే నాకు అంతే ఇష్టం అని చెప్తాడు”.ఇక ఈ సినిమా మొత్తం కథ ఉంగరం వెనుకే తిరుగబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఇందులో ఒక ఉంగరం మెయిన్‌గా కనిపిస్తూ ఉంటుంది. ఇంతకీ ఆ ఉంగరం కథేంటో తెలియాలంటే త్వరలో విడుదల కానున్న సినిమా చూడాల్సిందే మరి.