అర్థరాత్రి శ్రీహాన్‌ దుప్పట్లో దూరిన శ్రీ సత్య.. దెయ్యం అరుపులకు హౌజ్‌ మొత్తం రచ్చ రచ్చ

Published : Dec 06, 2022, 11:18 PM IST
అర్థరాత్రి శ్రీహాన్‌ దుప్పట్లో దూరిన శ్రీ సత్య.. దెయ్యం అరుపులకు హౌజ్‌ మొత్తం రచ్చ రచ్చ

సారాంశం

రాత్రి సమయంలో బిగ్‌ బాస్‌ హౌజ్‌లో విచిత్రం చోటు చేసుకుంది. దెయ్యం అరుపులకు హౌజ్‌ మేట్స్ అంతా భయంతో పరుగులు పెట్టారు.

బిగ్‌ బాస్‌ 6 తెలుగు(Bigg Boss 6 Telugu) 14వ వారంలో కెప్టెన్‌ ప్రత్యేకంగా లేకపోవడంతో కెప్టెన్సీ పోటీలు నిర్వహించడం లేదు. దీంతో ఇతర టాస్క్ లపై దృష్టి పెట్టారు బిగ్‌బాస్‌. గతంలో కోల్పోయిన ప్రైజ్‌ మనీని తిరిగి పొందేందుకు వివిధ రకాలు టాస్క్ ఇస్తున్నాడు బిగ్‌ బాస్‌. సోమవారం నిర్వహించిన మొదటి టాస్క్ ఫెయిల్‌ అయ్యారు. ఇక మంగళవారం నిర్వహించిన రెండో టాస్క్ రేవంత్‌-ఇనయ మధ్య పెట్టారు. కప్పులు పేర్చే టాస్క్ లో రేవంత్‌ గెలవడంతో లక్ష పది వేల రూపాయలు పొందారు. 

మూడో టాస్క్ లో ఆదిరెడ్డి-కీర్తి, శ్రీహాన్‌-శ్రీ సత్య మధ్య జరిగింది. మనీ నెంబర్స్ ఉన్న కార్డులను బాక్సుల్లో పడేయాల్సి ఉంటుంది. ఇందులో శ్రీ హాన్‌-శ్రీ సత్య గెలిచారు. అయితే ఇంటి సభ్యులు కీర్తి-ఆదిరెడ్డి గెలస్తారని చెప్పడంతో ఈ టాస్క్ లో లక్ష రూపాయలు గెలవడంలో విఫలమయ్యారు. అనంతరం సాండ్‌ని తమ బాటిల్స్ లో నింపే టాస్క్ లో రేవంత్‌, ఇనయ పాల్గొన్నారు. ఇందులో రేవంత్‌ విన్నర్‌ అయ్యారు. అయితే ఇంటి సభ్యులు కూడా ఆయనపేరే చెప్పడంతో ఈ టాస్క్ లో రెండు లక్షలు తిరిగి పొందారు. దీంతో బిగ్‌ బాస్‌ విన్నర్‌ ప్రైజ్‌ మనీ 41 లక్షల అయ్యింది.

అనంతరం రాత్రి సమయంలో బిగ్‌ బాస్‌ హౌజ్‌లో విచిత్రం చోటు చేసుకుంది. శ్రీ సత్య(Sri Satya) తనకు సంబంధించిన గతంలో జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకుంటూ ఆ విషయాన్ని ఇతర సభ్యులతో రాత్రి రెండుగంటల సమయంలో షేర్‌ చేసుకుంటుంది. ఓ ఫ్రెండ్ రాత్రి సమయంలో నిద్రలో లేచి నడుస్తున్నాడని చెబుతున్న క్రమంలో గట్టిగా అరిచిన శబ్దం వచ్చింది. దీంతో అంతా ఒక్కసారిగా భయపడ్డారు. అంతేకాదు శ్రీ సత్య వెళ్లి శ్రీహాన్‌(Srihan) దుప్పట్లో దూరింది. శ్రీహాన్‌ భయబ్రాంతులకు గురయ్యారు. ఆ తర్వాత మరోసారి శబ్దం రావడంతో అంతను రచ్చ రచ్చ చేశారు. శ్రీహాన్‌ బాగా భయపడిపోయాడా? లేక యాక్ట్ చేస్తున్నాడో గానీ మొత్తంగా బిక్కు బిక్కుమన్నట్టుగా వ్యవహరించారు. 

మరోవైపు ఇనయ కాసేపు దెయ్యం పట్టిన అమ్మాయిలా వ్యవహరించింది. తన బెడ్‌పై పడుకుని అరుపులు, గట్టిగా నవ్వుతూ భయటపెట్టించే ప్రయత్నం చేసింది. ఆదిరెడ్డి టార్గెట్‌గా ఆమె దెయ్యంగా యాక్ట్ చేసింది. ఈ ఎపిసోడ్‌ హౌజ్‌లో నవ్వులు పూయించాయి. ఇలా సో సోగా మంగళవారం ఎపిసోడ్‌ ముగిసింది. బిగ్‌ బాస్‌ షో చివరి దశకు చేరుకోవడంతో మిగిలిన టాస్క్ లేవి లేకపోవడంతో ప్రైజ్‌ మనీ రిటర్న్ పేరుతో బిగ్‌ బాస్‌ టైమ్‌ పాస్‌ చేస్తున్నాడనిపిస్తుంది. ప్రస్తుతం హౌజ్‌లో రేవంత్‌, శ్రీహాన్‌, రోహిత్‌, ఆదిరెడ్డి, శ్రీ సత్య, ఇనయ, కీర్తి ఉన్నారు. శ్రీహాన్‌ ఆల్‌రెడీ ఫైనల్‌కి చేరిన విషయం తెలిసిందే.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?