పవన్ కి వాళ్లు కూడా ఓటేయరు.. శ్రీరెడ్డి కామెంట్స్!

Published : Apr 10, 2019, 01:59 PM IST
పవన్ కి వాళ్లు కూడా ఓటేయరు.. శ్రీరెడ్డి కామెంట్స్!

సారాంశం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో సీఎం అభ్యర్ధిగా పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో సీఎం అభ్యర్ధిగా పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. పవన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి నటి శ్రీరెడ్డి అతడిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తోంది. ఇప్పుడు మరోసారి అతడిపై విరుచుకుపడింది.

పవన్ కళ్యాణ్ కచ్చితంగా గెలుస్తాడని జనసైనికులు బలంగా నమ్ముతున్నారు. ముఖ్యంగా సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన జెండా ఎగరడం ఖాయమంటున్నారు.

కానీ వివాదాస్పాదన శ్రీరెడ్డి మాత్రం పవన్ ని తీసిపారేస్తుంది. కాపులు కూడా పవన్ కు సపోర్ట్ చేయట్లేదని.. దూరంగా పెట్టారని అంటోంది. పవన్ కి అతడి ఫ్యాన్స్ సపోర్ట్ తప్ప ఇంకేమీ లేదని అంటోంది. భీమవరంలో రాజులు ఎవరూ కూడా పవన్ ని పట్టించుకోవడం లేదట.

గాజువాక, భీమవరం లో పవన్ గెలవకపోతే కేంద్రం నుండి రాష్ట్రానికి సపోర్ట్ వస్తుందట. ఇదేం లెక్కో మరి. రాష్ట్రానికి అభివృద్ధి కావాలంటే గ్లాసుకు మాత్రం ఓటేయకూడదని.. ఫ్యాన్ కి, సైకిల్ కి ఓటెయ్యాలని అంటోంది.

పవన్ కళ్యాణ్ ఇమేజ్ పై దెబ్బ కొడుతూ కావాలనే శ్రీరెడ్డి వైసీపీ, టీడీపీ పార్టీలకు సపోర్ట్ చేస్తుందనే విషయంలో స్పష్టంగా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Mahesh Babu: `వారణాసి` కోసం మహేష్‌ బాబు సాహసం.. కెరీర్‌లోనే మొదటిసారి ఇలా.. తెలిస్తే గూస్‌ బంమ్స్
850 కోట్లతో యానిమల్‌ కు షాక్ ఇచ్చిన ధురందర్, ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం