
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన 'బద్లా' సినిమా విడుదలై ఘన విజయం నమోదు చేసింది. లాంగ్ రన్ లో ఈ సినిమా వంద కోట్లు వసూలు చేసింది. తాప్సీ కీలకపాత్రలో నటించిన ఈ సినిమాకు సంజయ్ ఘోష్ దర్శకత్వం వహించారు.
రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై షారుఖ్ ఖాన్ ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లోకి చేరినప్పటికీ ఎవరూ దీని గురించి మాట్లాడకపోవడంపై అమితాబ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
చిత్ర నిర్మాత కానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ, సినిమా పరిశ్రమకి చెందిన ఏ ఒక్కరూ కూడా బద్లా విజయం గురించి మాట్లాడడానికి ఒక్క క్షణం తీరిక కూడా లేదంటూ ఎమోషనల్ గా పోస్ట్ పెట్టారు.
ఏదైతేనేం సినిమా మంచి హిట్ అయిందని.. ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు. ఇది చూసిన షారుక్.. మీరెప్పుడు పార్టీ ఇస్తారా..? అని ఎదురుచూస్తున్నామని ట్వీట్ చేశారు. రోజూ రాత్రిళ్లు మీ ఇంటి బయటే వేచి చూస్తున్నామని అమితాబ్ ని సముదాయించే ప్రయత్నం చేశారు.