
బీబీ జోడీలో జతకట్టిన శ్రీసత్య-మెహబూబ్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు. ఛాలెంజింగ్ సాంగ్స్ ఎంపిక చేసుకుని ఎనర్జిటిక్ స్టెప్స్ తో అదరగొడుతున్నారు. వారి కాస్ట్యూమ్స్ కూడా కేక పుట్టిస్తున్నాయి. కాగా తమ నెక్స్ట్ పెర్ఫార్మన్స్ కోసం ఇద్దరూ బాగా కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో శ్రీసత్యను మెహబూబ్ భుజాలపైకి ఎత్తుకోవాలి. ఈ మూమెంట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను మెహబూబ్ షేర్ చేశాడు.
ఆడియన్స్ ని ఆకట్టుకునేందుకు కఠినమైన స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తున్నారని మెహబూబ్ వీడియో చూస్తే అర్థం అవుతుంది. శ్రీసత్య-మెహబూబ్ మమేకమై ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే నెటిజన్స్ కొంచెం అపార్థం చేసుకున్నారు.ఓ నెటిజన్ 'శ్రీసత్యను పిసికేయకు మెహబూబ్' అంటూ కామెంట్ పోస్ట్ చేశారు. శ్రీసత్య లాంటి అందగత్తెతో డాన్స్ చేసే అదృష్టం మెహబూబ్ కి దక్కిందని పలువురు ఫీల్ అవుతున్నారు. తమ ఈర్ష్య కామెంట్స్ రూపంలో చూపిస్తున్నారు.
మెహబూబ్ ప్రొఫెషనల్ డాన్సర్. శ్రీసత్యకు కూడా డాన్స్ లో ప్రావీణ్యం ఉంది. వీరిద్దరూ జతకట్టడం ప్లస్ అయ్యింది. సాంగ్ సెలక్షన్, కాస్ట్యూమ్స్ లో కూడా వీరిద్దరూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. అందుకే జడ్జెస్ ఇంప్రెస్ అవుతున్నారు. కంటెస్టెంట్స్ సైతం మంచి మార్క్స్ వేస్తున్నారు. కాగా ఇటీవల శ్రీసత్యను ప్రేమిస్తున్నానంటూ ఓ ఫ్రాంక్ వీడియో చేశాడు మెహబూబ్.
వాలెంటైన్స్ డే రోజు... శ్రీసత్యకు ప్రఫోజ్ చేశాడు. ఆమె కాదు అనడంతో చేయి కోసుకోబోయాడు. తర్వాత అదంతా ఫ్రాంక్ అని శ్రీసత్యతో పాటు తన డాన్స్ టీమ్ సర్ప్రైజ్ చేశారు. కాగా బిగ్ బాస్ సీజన్ 4లో మెహబూబ్ పాల్గొన్నాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా చాలా వారాలు హౌస్లో ఉన్నాడు. సోహైల్ లో మెహబూబ్ ఫ్రెండ్షిప్ చేశాడు. ఆ సీజన్లో వీరిద్దరూ కలిసి స్కామ్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ఇక శ్రీసత్య సీజన్ 6లో పార్టిసిపేట్ చేశారు. ఈమె తన ప్రవర్తనతో ఫుల్ నెగిటివిటీ మూటగట్టుకుంది. నెటిజెన్స్ స్నేక్ అంటూ ట్రోల్ చేశారు. ఒక వర్గం ఆమెను ద్వేషించినా ఫైనల్ వీక్ వరకూ వెళ్లి సత్తా చాటారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా మధ్యలో ఎలిమినేట్ అయ్యింది. ఇక బీబీ జోడీలో శ్రీసత్య-మెహబూబ్ ఇరగదీస్తుండగా... టైటిల్ కొడతారనిపిస్తుంది. ఇద్దరూ చాలా సీరియస్ గా ట్రై చేస్తున్నారు.