
నందమూరి తారకరత్న తెలుగు చిత్ర పరిశ్రమని, అటు నందమూరి ఫ్యామిలీని శోకసంద్రంలో ముంచెత్తారు. ఆయన అకాల మరణం అందరిని కలచి వేస్తుంది. యంగ్ ఏజ్‌లో మరణించడం పట్ల సర్వత్రా విచారం వ్యక్తం చేస్తున్నారు. తారకరత్న భౌతికకాయాన్ని చూసేందుకు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తరలి వస్తున్నారు. వరుసగా టాలీవుడ్‌లో మరణాలు చోటు చేసుకుంటుండటం అందరిన కలచి వేస్తుంది.
తారకరత్న.. దాదాపు ఇరవై ఏళ్ల క్రితమే సినిమాల్లోకి వచ్చారు. `ఒకటో నెంబర్ కుర్రాడు` చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఒకేసారి ఆయన తొమ్మిది సినిమాలను స్టార్ట్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. కానీ ఆ తర్వాత వాటిలో చాలా ఆగిపోవడం, మిగిలినవి ఫ్లాప్ కావడం జరిగింది. నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ,హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మారి సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు తారకరత్న.
అయితే ఎన్టీఆర్‌కి పోటీగా తారకరత్నని సినిమాల్లోకి తీసుకొచ్చారనే ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదని, తామంతా ఒకే ఫ్యామిలీ, ఒకరికి పోటీగా తాను హీరోని అయ్యాననే దాంట్లో నిజం లేదన్నారు తారకరత్న. ఇదిలా ఉంటే తారకరత్నకి ఎన్టీఆర్ సహాయం చేశారట. వరుస ఫ్లాప్‌లు, ప్రేమ పెళ్లి కారణంగా తారకరత్న ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేశాడని, ఆ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్.. తారకరత్నకి ఆర్థిక సాయం చేశారని, ప్రతి నెల నాలుగు లక్షలు పంపించేవారని అప్పట్లో ప్రచారం జరిగింది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ గురించి తారకరత్న ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం తమ్ముడు ఎన్టీఆర్ అని వెల్లడించారు. తారక్ లేకపోతే తన పరిస్థితి చాలా దారుణంగాఉండేదన్నారు. నా కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు నా తమ్ముడు అండగా నిలిచాడని తారకరత్న చెప్పడం విశేషం.