
బుల్లితెరపై పాపులారిటీ దక్కించుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ షో ముందంజలో దూసుకుపోతుంది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ఈ షోని హోస్ట్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ షో 11 సీజన్లను పూర్తి చేసుకొని 12వ సీజన్ లోకి ఎంటర్ అయింది. ఈ నెల 16 నుండే ఈ షో టెలికాస్ట్ కానుంది. 'విచిత్ర జోడీస్' అనే థీమ్ తో ఈ సీజన్ నడవనుంది. అయితే ఇప్పుడు ఈ షోలో ఎవరు పాల్గొనున్నారనే విషయంలో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. తను శ్రీ దత్తా, తన సోదరితో కలిసి ఈ షోలో పాల్గొనుందని సమాచారం. అలానే కమెడియన్ భారతి తన భర్తతో కలిసి ఈ షోలో పాల్గొనడానికి వారానికి రూ.50 లక్షలు డిమాండ్ చేసిందట.
ఇక తాజాగా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ పేరు వినిపిస్తోంది. మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా జీవితకాల నిషేధం ఎదుర్కొన్న శ్రీశాంత్ బిగ్ బాస్ షోలో పాల్గొనున్నట్లు సమాచారం. ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన శ్రీశాంత్ మ్యాచ్ ఫిక్సింగ్ స్కామ్ లో జైలు జీవితం కూడా గడిపాడు. ఆయన ఈ షోలో పాల్గొంటే షోపై హైప్ మరింత పెరగడం ఖాయం!