హాట్ లుక్స్ తో అదరగొడుతున్న శ్రీముఖి

Published : Oct 15, 2017, 05:00 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
హాట్ లుక్స్ తో అదరగొడుతున్న శ్రీముఖి

సారాంశం

హీరోయిన్ ఛాన్సులు కొట్టేస్తున్న బుల్లితెర యాంకర్లు శ్రీముఖి హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ‘ గుడ్ బ్యాడ్ అగ్లీ’ గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్ విడుదల చేసిన శ్రీముఖి 

వెండితెరపై సత్తా చూపించేందుకు మరో బుల్లితెర యాంకర్ రెడీ అయిపోయింది. ఇప్పటికే అనసూయ, రష్మీ లాంటి యాంకర్లు సినిమాల్లో అవకాశాలు చేజిక్కించుకుంటూనే ఉన్నారు. తాజాగా వీరి జాబితాలో శ్రీముఖి కూడా చేరిపోయింది.

 

తాజాగా శ్రీ ముఖి, కిషోర్‌ కుమార్‌, హర్షవర్థన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’.  ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది.  డైరక్షన్‌ ఛాన్స్‌ కోసం తన స్వగ్రామంలో ఆర్జీవీ ‘శివ’ టెస్టు షూట్‌ అంటూ ప్రారంభమైన ట్రైలర్‌లో ‘శివ’, ‘గీతాంజలి’ సినిమాలను విమర్శిస్తూ హర్షవర్థన్‌ కనిపించారు. ‘హీరో ఫైటింగ్‌ చేయకుండా వార్నింగ్‌ ఇచ్చేస్తే రౌడీలు హీరోయిన్‌ వదిలేస్తారా?.

 

అసలు ఇదొక కథంటరా? వీడి సినిమా ట్రయల్‌ షూటింగ్‌తోనే ఆగిపోతుందిరో.. అయినా మన చినబాబు అనాలిరా.. ఎవరికి డైరెక్షన్‌ ఇవ్వాలో ఫ్యాన్స్‌ను ఒక మాట అడగొద్దూ.. ఎవడర్రా ఈ రామ్‌గోపాల్‌ వర్మ.. నాగార్జునతో ఫైటింగ్‌ సీన్‌ అంటే ఎలా ఉండాలి. తీశాడుగా! మన గడ్డం బాబాయి ‘ఆఖరిపోరాటం’. ఎలా ఉంటుంది! స్టన్‌ గన్‌ పట్టుకుని దడదడమంటూ కాల్చేస్తే అది ఫైట్‌ అంటే’ అంటూ హర్షవర్థన్‌ విమర్శిస్తుంటే వర్మ పాత్ర వచ్చి ‘నువ్వే డైరక్షన్‌ ఎందుకు చేయకూడదు’ అంటూ సలహా ఇవ్వడం.. మనోడు రెచ్చిపోతాడు. 

 

తర్వాత సినిమా కథ ప్రారంభం అవడం జరుగుతుంది.   ప్రముఖ స్టోరీ రైటర్, నటుడు హర్షవర్దన్ తొలిసారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా... అంజిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 1980లలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

 

త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ట్రైలర్ ని శ్రీముఖి ట్విట్టర్ లోపోస్టు చేసింది. ట్రైలర్ లో శ్రీముఖి చాలా హాట్ గా కనిపిస్తోంది.

 

PREV
click me!

Recommended Stories

NTR: షారూఖ్‌ ఖాన్‌తో ఎన్టీఆర్‌ భారీ మల్టీస్టారర్‌.. `వార్‌ 2`తో దెబ్బ పడ్డా తగ్గని యంగ్‌ టైగర్‌
జబర్దస్త్ లో సాధారణ కమెడియన్.. ప్రభాస్ కు క్లోజ్ ఫ్రెండ్ అని మీకు తెలుసా?