వేవ్స్ సమ్మిట్ : ప్రధాని మోడీ స్పీచ్ కి శ్రీలీల ఫిదా, ఆమె రియాక్షన్ ఇదే

Published : May 02, 2025, 03:57 PM IST
వేవ్స్ సమ్మిట్ : ప్రధాని మోడీ స్పీచ్ కి శ్రీలీల ఫిదా, ఆమె రియాక్షన్ ఇదే

సారాంశం

ముంబైలో గురువారం వేవ్స్ (వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్) అట్టహాసంగా ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభించారు.

ముంబైలో గురువారం వేవ్స్ (వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్) అట్టహాసంగా ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభించారు. భారతీయ చిత్ర పరిశ్రమలోని 24 విభాగాలకు చెందిన అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశాన్ని గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం వేవ్స్ 2025కు నాంది పలికిందని మోడీ పేర్కొన్నారు.

భారత్‌లో ఆరు లక్షల గ్రామాలున్నాయని.. మన పల్లెల్లోని ప్రతి వీధి ఒక కథ చెబుతుందని ప్రధాని చెప్పారు. శివుడి ఢమరుకం సృష్టిలోని తొలి శబ్ధమని మోడీ అన్నారు. సృజనాత్మకతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో త్వరలోనే వేవ్స్ అవార్డులను ప్రవేశపెడతామని , సినిమా వల్ల మనదేశ ఘనత నలుదిశలకు వ్యాప్తి చెందిందని మోడీ తెలిపారు. సత్యజిత్ రే, రాజ్ కపూర్, రాజమౌళి, ఏఆర్ రెహమాన్ తదితరులు భారతీయ సినిమాను ప్రపంచానికి పరిచయం చేశారని మోడీ ప్రశంసించారు.

వేవ్స్ సదస్సులో స్టార్ హీరోయిన్ శ్రీలీల పాల్గొన్నారు. ఈ సందర్భంగా  వేవ్స్ సదస్సుపై ఆమె తన అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రధాన నరేంద్ర మోడీ స్పీచ్ తనకెంతో నచ్చిందని, చాలా అద్భుతంగా ఉందని శ్రీలీల అన్నారు. వాణిజ్యంలో పెట్టుబడి పెట్టమని ప్రధాని మోడీ చెప్పిన విధానం తనకు బాగా నచ్చిందని శ్రీలీల తెలిపారు. వేవ్స్ సమ్మిట్ అద్భుతంగా ఉందని నిర్వాహకులను ఆమె ప్రశంసించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Long Delayed Movies: చిరంజీవి నుంచి నాగ చైతన్య వరకు.. లాంగ్ డిలే వల్ల అడ్రస్ లేకుండా పోయిన 8 సినిమాలు ఇవే
Akhanda 2 Release ఆగిపోవడానికి అసలు కారణం ఇదే ? బాలయ్య నెక్ట్స్ ఏం చేయబోతున్నాడు?