తొలిపాటకి వంద మిలియన్స్.. తమ్ముడు శిరీష్‌కి అభినందనలు తెలిపిన ఐకాన్‌ స్టార్‌

By Aithagoni RajuFirst Published Apr 15, 2021, 5:49 PM IST
Highlights

`విలయతి షరాబ్‌` పేరుతో హిందీలో కంపోజ్‌ చేసిన ఈ స్పెషల్‌ వీడియో సాంగ్‌ తాజాగా వంద మిలియన్స్ వ్యూస్‌ని దాటేసింది. ఈ సందర్భంగా తమ్ముడు అల్లు శిరీష్‌కి ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అభినందనలు తెలిపారు. 

అల్లు శిరీష్‌ చేసిన తొలి వీడియో సాంగ్‌ రికార్డులు క్రియేట్‌ చేస్తుంది. `విలయతి షరాబ్‌` పేరుతో హిందీలో కంపోజ్‌ చేసిన ఈ స్పెషల్‌ వీడియో సాంగ్‌ తాజాగా వంద మిలియన్స్ వ్యూస్‌ని దాటేసింది. వంద మిలియన్స్ సాధించిన సాంగ్స్ క్లబ్‌లో చేరింది. ఇందులో అల్లు శిరీష్‌, హెలి దరువాలా జంటగా వేసిన స్టెప్పుడు దుమ్ములేపుతున్నాయి. మాస్‌ శ్రోతలను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ పాటకి లిజో జార్జ్, డీజే చేటాస్‌ మ్యూజిక్‌ అందించగా, దర్షన్‌ రావల్‌, నీతి మోహన్‌ ఆలపించారు. కుమార్‌ లిరిక్‌ రాశారు. 

ఇదిలా ఉంటే ఈ సందర్భంగా తమ్ముడు అల్లు శిరీష్‌కి ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అభినందనలు తెలిపారు. `బిగ్‌ కంగ్రాట్చూలేషన్స్ శిరీష్‌. మీ పాట వంద మిలియన్స్ వ్యూస్‌ని సాధించినందుకు. చాలా గర్వంగా ఉంది. ఈ పాటకి పనిచేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు` అని ఇన్‌స్టా స్టోరీస్‌లో తెలిపారు బన్నీ. ఈ సందర్భంగా అల్లు శిరీష్‌ సైతం తన సంతోషాన్ని పంచుకున్నాడు. `మ్యూజిక్‌ లవర్స్ కి పెద్ద ధ్యాంక్‌. ఇండియా వైడ్‌గా ఇంతటి ప్రేమాభిమానాలు చూపించినందుకు. వంద మిలియన్స్ వ్యూస్‌ సాధించి టాప్‌ ఛార్ట్ లో నిలవడం ఊహించలేకపోతున్నా. టీమందరికి అభినందనలు` అని తెలిపారు. 

A big thank you to the music lovers, ppl all over India for showering so much love on Vilayati Sharaab. 100 million views & topping charts was something I din’t imagine at all. Congrats to , , Heli Daruwala & our whole VS Team. pic.twitter.com/dwSBA8CFw3

— Allu Sirish (@AlluSirish)

అల్లు శిరీష్‌ ప్రస్తుతం ఓ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీలో నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దీన్ని త్వరలోనే అఫీషియల్‌గా ప్రకటించనున్నారు. మరోవైపు బన్నీ ప్రస్తుతం `పుష్ప` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన `పుష్పరాజ్‌` టీజర్‌ భారీ వ్యూస్‌తో దూసుకుపోతుంది. తాజాగా ఇది 45 మిలియన్స్ వ్యూస్‌ని చేరుకుంది. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది. ఇది ఆగస్ట్ 13న విడుదల కానుంది.
 

click me!