ప్రముఖ సీనియర్‌ నటుడు రణ్‌ధీర్‌ కపూర్‌కి కరోనా.. ఆసుపత్రిలో చికిత్స..

Published : Apr 30, 2021, 10:00 AM IST
ప్రముఖ సీనియర్‌ నటుడు రణ్‌ధీర్‌ కపూర్‌కి కరోనా.. ఆసుపత్రిలో చికిత్స..

సారాంశం

తాజాగా బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు రణ్‌ధీర్‌ కపూర్‌కి కరోనా సోకింది. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. గురువారం ఆయన ఆసుపత్రిలో చేరినట్టు ముంబయిలోని కోకిలాబెన్‌ ఆసుపత్రికి చెందిన డాక్టర్‌ సంతోష్‌ శెట్టి తెలిపారు.

ఇటు టాలీవుడ్‌, అటు బాలీవుడ్‌ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో సెలబ్రిటీలు బాధితులుగా మారుతున్నారు. తాజాగా బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు రణ్‌ధీర్‌ కపూర్‌కి కరోనా సోకింది. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. గురువారం ఆయన ఆసుపత్రిలో చేరినట్టు ముంబయిలోని కోకిలాబెన్‌ ఆసుపత్రికి చెందిన డాక్టర్‌ సంతోష్‌ శెట్టి తెలిపారు. 74ఏళ్ల వయసుగల రణ్‌ధీర్‌ కపూర్‌ తమ ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నాడని, ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. 

బాలీవుడ్‌ లెజెండరీ నటుడు రాజ్‌ కపూర్‌కి పెద్ద కుమారుడు రణ్‌ధీర్‌ కపూర్‌. గతేడాది వీరి సోదరులు, బాలీవుడ్‌ నటులు రిషి కపూర్‌, రాజీవ్‌ కపూర్‌ కన్నుమూసిన విషయం తెలిసిందే. రిషి కపూర్ మరణించి నేటితో(ఏప్రిల్‌ 30)సరిగ్గా ఏడాది అవుతుంది. తాజాగా రణ్‌ధీర్‌ కపూర్‌ కూడా కరోనాతో ఆసుపత్రిలో చేరడం ఆందోళన కలిగిస్తుంది. గత వారం రణ్‌ధీర్‌ కపూర్‌ తన భార్య బబితా కపూర్‌ బర్త్ డే పుట్టిన రోజు వేడుకలో పాల్గొని సందడి చేశారు. ఇందులో వీరి కూతురు, స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ కూడా పాల్గొన్నారు. రణ్‌ధీర్‌, బబితాలకు ఇద్దరు కూతుళ్లు కరిష్మా కపూర్‌, కరీనా కపూర్‌ ఉన్న విషయం తెలిసిందే.

రణ్‌ ధీర్‌ కపూర్‌ బాలనటుడిగా `శ్రీ 420`, `దో ఉస్తాద్‌` చిత్రాల్లో నటించారు. `కల్‌ ఆజ్‌ ఔర్‌ కల్‌`తో హీరోగా పరిచయం అయ్యారు. `రాంపూర్‌ కా లక్ష్మణ్‌`, `జీత్‌`, `జవాని దివాణి`, `హమ్రాహి`, `లఫాంగే`, `పొంగా పండిట్‌`, `హాత్‌ కి సఫాయి`, `హెన్నా` వంటి చిత్రాల్లో హీరోగా విజయాలు అందుకున్నారు. నటుడిగానే కాదు నిర్మాతగా, దర్శకుడిగానూ తన సత్తా చాటుకున్నారు. నిర్మాతగా `హెన్నా`, `ప్రేమ్‌ గ్రాంత్‌`, `ఆ అబ్‌ లాట్‌ చలెన్` సినిమాలను నిర్మించారు. ఇక దర్శకుడిగా `కల్‌ ఆజ్‌ ఔర్‌ కల్‌`, `ధరమ్‌ కరమ్‌`,`హెన్నా` సినిమాలకు దర్శకత్వం వహించడం విశేషం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ప్రభాస్‌కి గ్యాప్‌ లేకుండా చేసిన చిరంజీవి.. `మన శంకరవరప్రసాద్‌ గారు` రిలీజ్‌ డేట్‌ ఫిక్స్
Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన