శ్రీజ తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటుంది. అది సంతోషం, బాధ ఏదైనా సరే అంటూ ఓ ఒక పోస్టు ద్వారా ఫ్యాన్స్ కు తెలియజేస్తూ ఉంటుంది.
మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ ఎమోషనల్ గా పెట్టిన పోస్ట్ ఇప్పుడు అంతటా వైరల్ గా మారింది. ఓ వర్గంలో హాట్ టాపిగ్ గామారింది. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను దాదాపు 4 లక్షల మంది ఫాలో అవుతున్నారు. అక్కడ శ్రీజ తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటుంది. అది సంతోషం, బాధ ఏదైనా సరే అంటూ ఓ ఒక పోస్టు ద్వారా ఫ్యాన్స్ కు తెలియజేస్తూ ఉంటుంది.
ఇక మెగా ఫ్యామిలీ అంతా వివాహ మహోత్సవంలో మునిగి తేలి ఆనందంగా ఉంది. ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం గ్రాండ్ గా జరిగింది. మెగా ఫ్యామిలీ ఇటలీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న వీడియోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఊహించని విధంగా తాజాగా శ్రీజ పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. ‘పరిస్థితులు అస్తవ్యస్తంగా మారినప్పుడు హృదయం గాయపడుతుంది’ అంటూ శ్రీజ తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది.
ఈ పోస్టులో .. ‘‘ విషయాలు మన కంట్రోల్‌లో లేనపుడు.. పరిస్థితులు దారుణంగా, కఠినంగా ఉన్నపుడు.. గుండెకు గాయమై బద్ధలు అయినపుడు.. మనసు డిస్ట్రబ్, స్పూర్తిదాయకంగా లేనపుడు.. శరీరం అలసి, సొలసి ఉన్నపుడు… కళ్లు మూసుకుని నాలోని ప్రపంచంతో కనెక్ట్ అవ్వటమే ఓ మంచి మార్గం’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీజ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ పోస్ట్ కు ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తోంది. లక్షకుపైగా వ్యూస్.. 18 వేలకుపైగా లైక్స్ వచ్చాయి. ఈ క్రమంలో శ్రీజకు ఏమైంది? ఎందుకిలా మాట్లాడుతోంది...పెళ్లిలో సరదాగా గడిపిన ఆమెలో ఇంతలోనే ఈ నిర్వేదమేంటని అంటున్నారు.