రవితేజలోని మరో మాస్‌ యాంగిల్‌.. గూస్‌బంమ్స్ తెప్పించేలా `ఈగల్` టీజర్‌..

Published : Nov 06, 2023, 11:32 AM IST
రవితేజలోని మరో మాస్‌ యాంగిల్‌.. గూస్‌బంమ్స్ తెప్పించేలా `ఈగల్` టీజర్‌..

సారాంశం

కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్లతో అలరించిన రవితేజ.. ఇప్పుడు తనలోని మరో యాంగిల్‌ని చూపిస్తున్నాడు. అందుకు నిదర్శనమే `ఈగల్‌` మూవీ టీజర్‌.

మాస్‌ మహారాజా రవితేజ(Raviteja) హీరోగా రూపొందుతున్న మూవీ `ఈగల్‌`(Eagle). ఇటీవల `టైగర్‌ నాగేశ్వరరావు`తో డిజప్పాయింట్‌ చేసిన ఆయన ఇప్పుడు `ఈగల్‌` అంటూ మరోసారి యాక్షన్‌ మూవీతో రాబోతున్నారు. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. అనుపమా పరమేశ్వరన్‌(Anupama Parameswaran) హీరోయిన్‌గా నటిస్తుంది. నవదీప్‌, శ్రీనివాస్‌ అవసరాల, మధు బాల, కావ్య థాపర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ సోమవారం విడుదలైంది. 

తాజాగా విడుదలైన టీజర్‌ (Eagle Teaser) పూర్తి యాక్షన్‌ ఎపిసోడ్స్ తో సాగింది. ఆద్యంతం యాక్షన్‌ ఎపిసోడ్స్ తో, గూస్‌బంమ్స్ తెప్పించే సన్నివేశాలతో ఈ టీజర్ ఉండటం విశేషం. `కొండల్లో లావాని కిందకి పిలవకు, ఊరు ఉండదు, నీ ఉనికీ ఉండదు` అని రవితేజ డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమైంది. వరుస యాక్షన్‌ సీన్లు, చనిపోయిన విలన్లని చూపిస్తూ, ఎక్కడ ఉంటాడని అనుపమా పరమేశ్వరన్‌ అడగ్గా, అడవిలో ఉంటాడు, నీడై తిరుగుతుంటాడు  కనిపించడు, కానీ వ్యాపించి ఉంటాడు అని శ్రీనివాస్‌ అవసరాల చెబుతాడు, వెలుతురు వెళ్లే ప్రతి చోటుకి అతని బుల్లెట్‌ వెళ్తుంది అని మరో నటుడు చెప్పడం, 

ఇది విధ్వంసం మాత్రమే, తర్వాత చూడబోయేది విశ్వరూపమే నవదీప్‌ చెప్పగా, వరుసగా యాక్షన్‌ సీన్లు వస్తాయి, ఆ తర్వాత ఫారెస్ట్ గ్రామంలో జనాలంతా దెండం పెడుతుండగా, రవితేజ లుంగీ కట్టుకుని ఎంట్రీ ఇస్తాడు. ఊర మాస్‌ లుక్‌లో అదరిపోయేలా ఉన్నాడు. మనిషా, మిత్‌ అని అనుపమా అడగ్గా జనాల కట్టుకథ, ప్రభుత్వాలు కప్పెట్టిన కథ, ఆ మనిషి అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పడంతో రవితేజ చిటికేయగా ఇళ్లు బ్లాస్‌ అవుతుంది, రవితేజ కోర మీసాలతో ఊరమాస్‌ సీరియస్‌ లుక్‌లో వాహ్‌ అనేలా ఉన్నాడు. పైగా బీడీ తాగుతూ కనిపించడం మరింత ఆసక్తికరంగా ఉంది. ఇంతలో ఈగల్‌ ఎగురుతూ కనిపించడం రవితేజ మాస్‌ ఎంట్రీ అదిరిపోయేలా ఉంది. చివరగా `బాన్‌ వొయాజ్‌` అంటూ రవితేజ ఇచ్చిన ఫినిషింగ్‌ టచ్ సూపర్‌ అనేలా ఉంది. 

రవితేజలోని మరో యాంగిల్‌ని ఆవిష్కరించేలా ఉండటం ఈ సినిమా ఉండబోతుందని టీజర్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. అయితే ఇందులో ఫారెస్ట్ లో ఉంటూ ప్రత్యర్థులను అంతం చేస్తూ రహస్య కార్యకలాపాలు నిర్వహిస్తుంటాడు రవితేజ. ఆయన ఎవరు? ఆయన ఏం చేస్తాడు? అనే అన్వేషణ ఓ వైపు పోలీసుల నుంచి, మరోవైపు ప్రత్యర్థుల నుంచి జరుగుతుంటుంది. టీజర్‌ సినిమాపై ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. అదే సమయంలో పూర్తి సీరియస్‌గానూ సాగడం గమనార్హం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ మూవీని రిలీజ్‌ చేయబోతున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

నా కూతురు చిన్న పిల్ల... మీరు రాసే వార్తలు చదివితే తట్టుకోగలదా? స్టార్ హీరో ఎమోషనల్
Balakrishna Favourite : బాలయ్య కు బాగా ఇష్టమైన హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా? ఆ ఇద్దరే ఎందుకు ?