ఆ డబ్బు కూడబెట్టింది నేనే.. ‘‘ మా ’’ భవనాన్ని ఎందుకు అమ్మేశారు: మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Aug 22, 2021, 03:31 PM ISTUpdated : Aug 22, 2021, 03:32 PM IST
ఆ డబ్బు కూడబెట్టింది నేనే.. ‘‘ మా ’’ భవనాన్ని ఎందుకు అమ్మేశారు: మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

సారాంశం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ (మా)లో జరుగుతున్న పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్ హీరో మోహన్ బాబు.  తాను కూడబెట్టిన డబ్బుతో బిల్డింగ్ కొని దానిని మళ్లీ అమ్మేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు మోహన్ బాబు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో గందరగోళ పరిస్ధితులు నెలకొన్నాయన్నారు సినీనటుడు మోహన్ బాబు. ఎవరికీ వారే యమునా తీరే  అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తాను కూడబెట్టిన డబ్బుతో బిల్డింగ్ కొని దానిని మళ్లీ అమ్మేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు మోహన్ బాబు. ఎన్ని గ్రూపులు వున్నాయో, వారి అభిప్రాయాలు తీసుకుని కృష్ణంరాజు నిర్ణయం తీసుకుంటారని మోహన్ బాబు చెప్పారు.

అధిక మొత్తంలో భవనాన్ని కొనుగోలు చేసి అతి తక్కువ ధరకే దానిని ఎందుకు అమ్మేశారని మోహన్ బాబు ప్రశ్నించారు. అసోసియేషన్ భవనం అమ్మకంపై ఎవరైనా మాట్లాడారా అని ఆయన నిలదీశారు. అసోసియేషన్ భవనం విషయం తనని ఎంతో కలిచివేస్తోందని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. 

ALso Read:Maa Elections: ‘‘ జెండా ఎగరేస్తాం’’ .. వైరల్ అవుతోన్న ప్రకాశ్ రాజ్ ట్వీట్

అనంతరం ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. ఎన్నికల వీలైనంత త్వరగా నిర్వహించాలని కోరారు. సెప్టెంబర్ 12న ఎన్నికలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం మురళీ మోహన్ మాట్లాడుతూ.. త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో నిర్ణయం  తీసుకుంటామని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి