Sravana Bhargavi: అన్నమయ్య సంకీర్తనని అవమానించేలా శ్రావణ భార్గవి వీడియో.. కోర్టుకి వెళతాం అంటూ వార్నింగ్ 

Published : Jul 20, 2022, 08:58 AM IST
Sravana Bhargavi: అన్నమయ్య సంకీర్తనని అవమానించేలా శ్రావణ భార్గవి వీడియో.. కోర్టుకి వెళతాం అంటూ వార్నింగ్ 

సారాంశం

అన్నమయ్య కీర్తనలలో ఒకటైన 'ఒకపరి కొకపరి' అనే సంకీర్తనపై శ్రావణ భార్గవి వీడియో చేసింది. ఈ వీడియోలో ఆమె గ్లామర్ గా కనిపించేందుకు, సిగ్గు పడుతూ, నవ్వుతూ కనిపించింది. 

టాలీవుడ్ లో సింగర్ గా శ్రావణ భార్గవి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తాజాగా శ్రావణ భార్గవి వివాదంలో చిక్కుకుంది. తిరుమల శ్రీవారిపై ఎన్నో భక్తి గీతాలు రచించిన తెలుగు వాగ్గేయ కారుడు అన్నమయ్య సంకీర్తన పట్ల శ్రావణ భార్గవి అవమానకరంగా వ్యవహరించింది. దీనితో వివాదం మొదలైంది. 

అన్నమయ్య కుటుంబ సభ్యులు రంగంలోకి దిగి శ్రావణ భార్గవిపై మండిపడుతున్నారు. తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. అన్నమయ్య కీర్తనలలో ఒకటైన 'ఒకపరి కొకపరి' అనే సంకీర్తనపై శ్రావణ భార్గవి వీడియో చేసింది. ఈ వీడియోలో ఆమె గ్లామర్ గా కనిపించేందుకు, సిగ్గు పడుతూ, నవ్వుతూ కనిపించింది. 

బ్యాగ్రౌండ్ లో సంకీర్తన వినిపిస్తుండగా చీరకట్టులో తన సొగసులు చూపించేందుకు ప్రయత్నించింది శ్రావణ భార్గవి. అన్నమయ్య సంకీర్తనని ఇలా గ్లామర్ పరంగా వాడుకోవడంపై వారి కుటుంబ సభ్యులు హరినారాయణ చార్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ కీర్తనని శ్రావణ భార్గవి అందాన్ని వర్ణించడానికి ఎలా ఉపయోగిస్తుంది అంటూ ప్రశ్నిస్తున్నారు. 

అన్నమాచార్యుల పెద్ద కుమారుడు తిరుమలాచార్యులు ఆ కీర్తనని స్వామివారికి అభిషేకం చేస్తూ ఎంతో భక్తిగా ఆలపించారు అని హరినారాయణ అన్నారు. అలాంటి కీర్తనని అవమానించేలా శ్రావణ భార్గవి వ్యవహరించింది అని ఆయన అన్నారు. దీనిపై శ్రావణ భార్గవితో మాట్లాడితే అందులో తప్పేముంది అన్నట్లుగా బాధ్యత లేకుండా సమాధానం ఇచ్చిందని అంటున్నారు. 

శ్రావణ భార్గవిపై టిటిడి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని, కోర్టుకి కూడా వెళతానని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. మరి శ్రావణ భార్గవి దిగి వచ్చి క్షమాపణ చెబుతుందో లేదో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఎలాగైనా రీతూని సైడ్ చేయాలని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కుట్ర.. వీళ్ళ స్ట్రాటజీతో భరణి బలి
Akhanda 2 Premiers: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు, తీవ్ర ఇబ్బందుల్లో నిర్మాతలు.. సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి ?