తన గెలుపు కారణం పవన్ అభిమానులంటున్న శివబాలాజి

Published : Sep 28, 2017, 05:43 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
తన గెలుపు కారణం పవన్ అభిమానులంటున్న శివబాలాజి

సారాంశం

బిగ్ బాస్ షో విజేతగా  నిలిచిన శివబాలాజి తాను పవన్ కళ్యాణ్ అభిమానినన్న శివ బాలాజి పవన్ అభిమానుల కారణంగానే గెలిచానన్న శిబాలాజి

సినీ నటుడు శివబాలాజీ.. ఆనందోత్సాహాల నడుమ తేలియాడుతున్నారు. ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించిన  బుల్లితెర రియాల్టీ షో ‘బిగ్ బాస్’ సీజన్ -1 కి శివబాలాజీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా సినీ అవకాశాలు లేక వెనకపడిపోయిన శివబాలాజీ... ఈ షోలో విజేతగా నిలవడం తో మళ్లీ సెలబ్రటీ స్టేటస్ ని అందిపుచ్చుకున్నాడు. తాను ఈ షోలో గెలవడానికి కారణం పవన్ అభిమానులనేని చెబుతున్నాడు శివ బాలాజి.

 

తనకు పవన్ కళ్యాణ్ అంటే చాల ఇష్టం అని.. ఏడేళ్ళ క్రితం ‘అన్నవరం’ సినిమా చేస్తున్నప్పుడు తనకు పవన్ తో ఏర్పడిన అనుబంధం ఇప్పటికీ కొనసాగుతోందని చెప్పాడు. తన గతేడాది పుట్టిన రోజు వేడుకలను ‘ కాటమరాయుడు’ చిత్ర షూటింగ్ లో పవన్ తోపాటు చేసుకోవడాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపాడు. ఆ రోజు తాను పవన్ కి ఒక కత్తిని బహుమతిగా ప్రకటించానని.. ఆ విషయాన్ని గుర్తించుకునే పవన్ అభిమానులు ఇప్పుడు నన్ను గెలిపించారని ఆనందం వ్యక్తం చేశాడు.

 

మొదట బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు.. తాను అంగీకరించలేదని చెప్పాడు. అయితే.. దానివల్లే కెరిర్ యూటర్న్ తీసుకుంటుందని తన సన్నిహితులు నచ్చచెప్పారని.. అందుకే వచ్చి ఇప్పుడు విజేతగా నిలిచానన్నాడు.

PREV
click me!

Recommended Stories

Heroes Come Back: 2025లో అదిరిపోయే కమ్‌ బ్యాక్‌ ఇచ్చిన 10 మంది హీరోలు వీరే.. పవన్‌ నుంచి ఆది వరకు
Gunde Ninda Gudi Gantalu: నా నుంచి ఏమైనా దాచిపెడుతున్నావా? రోహిణీని ప్రశ్నించిన మనోజ్, ప్రభావతిలోనూ అనుమానం