సూపర్‌స్టార్‌ మహేష్‌ 'స్పైడర్‌' మొదటిరోజు కలెక్షన్‌ రూ.51 కోట్లు

Published : Sep 29, 2017, 10:52 AM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
సూపర్‌స్టార్‌ మహేష్‌ 'స్పైడర్‌' మొదటిరోజు కలెక్షన్‌ రూ.51 కోట్లు

సారాంశం

మహేష్ , మురుగదాస్ ల కాంబినేషన్ లో వచ్చిన స్పైడర్ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన స్పైడర్ మిక్స్ డ్ టాక్ వచ్చిన స్పైడర్ తొలిరోజు వసూళ్లు రూ.51కోట్లు  

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మించిన భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'స్పైడర్‌'. సెప్టెంబర్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు 51 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసి సంచలనం సృష్టించింది. 


ఈ సందర్భంగా నిర్మాతలు ఎన్‌.వి.ప్రసాద్‌, ఠాగూర్‌ మధు మాట్లాడుతూ ''భారీ బడ్జెట్‌తో సూపర్‌స్టార్‌ మహేష్‌, మురుగదాస్‌ కాంబినేషన్‌లో నిర్మించిన 'స్పైడర్‌' చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయి. ఓవర్సీస్‌ ప్రీమియర్స్‌లోనే 1 మిలియన్‌ డాలర్లకుపైగా కలెక్ట్‌ చేసి సంచలనం సృష్టించింది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా 'స్పైడర్‌' మొదటిరోజు 51 కోట్లు కలెక్ట్‌ చేయడం మాకెంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు.

 

ఇంతటి భారీ విజయాన్ని మాకు అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇంత భారీ సినిమా చేసే అవకాశం ఇచ్చిన సూపర్‌స్టార్‌ మహేష్‌ సర్ కు, మురుగదాస్‌ గారికి మా కృతజ్ఞతలు అని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

భార్యతో పదేళ్ల ప్రేమను సెలబ్రేట్ చేసుకున్న రిషబ్ శెట్టి..బ్యూటిఫుల్ ఫోటోస్ వైరల్
Medha Rana: బోర్డర్ 2తో ప్రేక్షకుల మనసు గెలిచిన నటి ? ఆమె కుటుంబ సభ్యులంతా..