Roar of RRR in Mumbai: రాంచరణ్, ఎన్టీఆర్ బ్యాక్ స్టేజ్ బ్రొమాన్స్ వైరల్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 19, 2021, 03:49 PM IST
Roar of RRR in Mumbai: రాంచరణ్, ఎన్టీఆర్ బ్యాక్ స్టేజ్ బ్రొమాన్స్ వైరల్

సారాంశం

ముంబై వేదికగా భారీ ఈవెంట్ కు ఆర్ఆర్ఆర్ టీం రెడీ అయింది. బాహుబలి చిత్రంతో  రాజమౌళి ఇండియా వ్యాప్తంగా బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు. దీనితో ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.

ముంబై వేదికగా భారీ ఈవెంట్ కు ఆర్ఆర్ఆర్ టీం రెడీ అయింది. బాహుబలి చిత్రంతో  రాజమౌళి ఇండియా వ్యాప్తంగా బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు. దీనితో ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న మల్టి స్టారర్ మూవీ కావడంతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. 

ఇదిలా ఉండగా నేడు ముంబైలో Roar of RRR in Mumbai పేరుతో భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కోసం రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ ముందుగా ముంబైకి చేరుకున్నారు. బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ ఈ ఈవెంట్ కి హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇక కండల వీరుడు సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రాంచరణ్ , ఎన్టీఆర్ ముందుగా వేదిక వద్దకు చేరుకున్నారు. ఈవెంట్ ఏర్పాట్లని గమనిస్తూ సరదాగా గడుపుతున్నారు. స్టేజి వెనుక చరణ్, ఎన్టీఆర్ సరదాగా మాట్లాడనుకుంటున్న పిక్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. చరణ్, ఎన్టీఆర్ ల బ్యాక్ స్టేజ్ బ్రొమాన్స్ అంటూ ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కూల్ లుక్ లో అదరగొడుతున్నారు. ముంబైలో ఒక తెలుగు చిత్రానికి ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించడం చరిత్రలో బహుశా ఇదే తొలిసారి ఏమో. దీనితో చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి ఏం మాట్లాడతారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం