బాలయ్య,అనీల్ రావిపూడి చిత్రం టైటిల్ తో పాటు మరో షాకింగ్ న్యూస్

మాస్‌, క్లాస్‌ కథ ఏదైనా బాలకృష్ణ తనదైన శైలిలో నటించగలరని ఇప్పటికే ప్రూవైంది. ఇక ఫన్ తో కలిసిన మాస్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాలను తీయడంలో అనిల్‌ తనకు తానే సాటి.  



తెలుగు చిత్ర పరిశ్రమలో పట్టాలెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో బాలకృష్ణ-అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌ ఒకటి. ఆ మధ్యన బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో ముచ్చటిస్తూ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తాను నటిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్‌పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మాస్‌, క్లాస్‌ కథ ఏదైనా బాలకృష్ణ తనదైన శైలిలో నటించగలరని ఇప్పటికే ప్రూవైంది. ఇక ఫన్ తో కలిసిన మాస్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాలను తీయడంలో అనిల్‌ తనకు తానే సాటి. ‘సరిలేరు నీకెవ్వరు’లో మహేశ్‌ను ఎలా చూపించారో అందరికీ తెలిసిందే. దాంతో  బాలయ్యను ఎలా చూపిస్తారోనని ఆయన అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. 

ఈ నేపథ్యంలో సినిమా టైటిల్ తో పాటు  ఓ షాకింగ్ వార్త టాలీవుడ్‌ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.  అదేంటంటే... ఈ సినిమాలో బాలయ్య త్రిపాత్రాభినయం చేస్తారట. ఫుల్ లెంగ్త్ ఫన్ తో సినిమా నడుస్తుందిట. అలాగే ఈ సినిమాకు రామారావు గారు అనే టైటిల్ కాదట...NBK అనే టైటిల్ ని ఫిక్స్ చేయబోతున్నారట. మూడు అక్షరాలు..మూడు క్యారక్టర్స్ కు సంభందించిన పేర్లు అని తెలుస్తోంది. కాబట్టి బాలయ్యని ఓ కొత్తతరహా పాత్రల్లో చూడబోతున్నారట. అలాగే మూడు విభిన్న గెటప్ లు కూడా సినిమాలో ఉంటాయట. ఈ మేరకు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ జరుగుతోందిట. 

Latest Videos

అలాగే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం 75 కోట్లు బడ్జెట్ ని కేటాయించనున్నారట.  షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుందట. ఇందులో నిజానిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. మరోవైపు బాలయ్య  బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమాలో నటిస్తున్నారు. దీని తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో దర్శకుడు గోపీచంద్ మలినేని తో ఓ సినిమా చేయనున్నాడు.

 ఇంతకు ముందెన్నడూ చూడని స్టైలిష్‌ లుక్‌లో బాలకృష్ణ కనిపించనున్నారట. అంతేకాదు, సినిమాలో ఆయన పాత్ర కూడా చాలా ఎనర్జెటిక్‌గా ఉంటుందని సమాచారం. బాలయ్య ప్రతి సినిమాలో వైవిధ్యం ఉండేలా చూసుకుంటూ యువ హీరోలతో పోటీ పడుతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో ‘అఖండ’లో నటిస్తున్నారు. దీంతోపాటు గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. అటు అనిల్‌ రావిపూడి ‘ఎఫ్‌3’ని పూర్తిచేసే పనిలో ఉన్నారు.
 

click me!