గాన గంధర్వుడు ఎస్పీ బాలు తొలి పాటకి యాభైనాలుగేళ్ళు ..అదేంటో తెలుసా?

By Aithagoni RajuFirst Published Dec 15, 2020, 8:27 AM IST
Highlights

ఎస్పీ బాలు గాయకుడిగా జీవితం ప్రారంభమై నేటితో 54ఏళ్ళు అయ్యింది. ఓ పాటల పోటీలో పాల్గొన్న బాలసుబ్రమణ్యం ప్రతిభను పసిగట్టి `శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామన్న` చిత్రంలో తొలిసారిగా ఆయనతో సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి పాట పాడించాడు. 

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడి ఓడిపోయారు. ఆయన కన్నుమూసి రెండు నెలలు దాటింది. పాట ప్రియులను, తన అభిమానులను వదిలేసి వెళ్లిపోయాడు. ఆయన మరణం యావత్‌ భారతీయ చిత్ర పరిశ్రమకి తీరని లోటుగా మిలిగింది. ముఖ్యంగా సంగీత ప్రపంచానికి అది పెద్ద లోటు. దాదాపు ఐదున్నర దశాబ్దాలుగా  పాటల ప్రపంచంలో ఏకఛక్రాధిపత్యంగా వెలిగారాయన. ఎంత మంది గాయకులు ఉన్నా ఎస్పీది ప్రత్యేకమైన స్థానం, దాన్ని ఎవరూ పూడ్చలేరు. 16 భాషల్లో 40వేలకుపైగా పాటలు పాడి సత్తా చాటారు. 

కేవలం గాయకుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగా, నటుడిగా, డబ్బింగ్‌ ఆర్టిస్గుగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణించారు. అయితే ఎస్పీ బాలు గాయకుడిగా జీవితం ప్రారంభమై నేటితో 54ఏళ్ళు అయ్యింది. ఓ పాటల పోటీలో పాల్గొన్న బాలసుబ్రమణ్యం ప్రతిభను పసిగట్టి `శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామన్న` చిత్రంలో తొలిసారిగా ఆయనతో సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి పాట పాడించాడు. 1966డిసెంబర్‌ 15 సాయంత్రం ఆరు గంటలకు బాలు తొలి పాట `ఏమి ఈ వింత మోహం` రికార్డ్ అయ్యింది. 

దీనికి ప్రకారం బాలు ప్రభంజానానికి పునాది పడి నేటితో యాభై నాలుగు ఏళ్లు అయ్యిందన్నమాట. అప్పటి వరకు ఘంటసాల పాటకు ఆలవాటు పడిన తెలుగు ప్రేక్షకులను, సంగీత ప్రియులను బాలు రూపంలో కొత్త స్వరం ఆకట్టుకుంది. అనతికాలంలోనే బాలు గొంతు ప్రేక్షకులను, శ్రోతలను అలరించింది, దగ్గరైంది.. మంత్రముగ్ధుల్ని చేసింది. ఇక బాలసుబ్రమణ్యం సెప్టెంబర్‌ 26న కరోనాతో కోలుకుని ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. 

click me!