ఎస్పీబీ ఆరోగ్య పరిస్దితిపై లేటెస్ట్ అప్ డేట్

Published : Aug 14, 2020, 08:20 AM IST
ఎస్పీబీ  ఆరోగ్య పరిస్దితిపై లేటెస్ట్ అప్ డేట్

సారాంశం

చిత్ర పరిశ్రమలో లెజెండరీ సింగర్ గా పేరు ప్రఖ్యాతులు గడించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అంతేకాదు తనకు కరోనా సోకిన విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఆయన చెన్నైలోని ఓ కార్పోరేట్ హాస్పిటల్‌లో కోవిడ్‌కు చికిత్స తీసుకుంటున్నారు. 

 కరోనా వైరస్..శరవేగంగా విస్తరిస్తోంది.  ఎవ్వరినీ వదలట్లేదు. సామాన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు  దాకా అందరూ కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు కరోనా సోకగా.. రీసెంట్ గా గాన గంధర్వుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 

ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా ఎస్పీబీ అభిమానులకు తెలియజేశారు. దాంతో ఆయనకు ఎలా ఉంది..కోలుకుంటున్నారా అనే విషయాలపై హెల్త్ బులిటిన్ విడుదల చేసారు. 

ప్రస్తుతం చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఎస్పీబీ కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా ఆ హాస్పిటల్ డాక్టర్లు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హెల్త్ కండిషన్ పై బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని.. శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ నిలకడగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా