`ఆహా` కోసం చిరు తన మెగాస్టార్‌ ఇమేజ్‌ని తాకట్టు పెడతాడా?

Published : Aug 14, 2020, 07:55 AM IST
`ఆహా` కోసం చిరు తన మెగాస్టార్‌ ఇమేజ్‌ని తాకట్టు పెడతాడా?

సారాంశం

చిరంజీవి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అయిన `ఆహా` కోసం రంగంలోకి దిగబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆయన తన బావమరిది అల్లు అరవింద్‌ ప్రారంభించిన `ఆహా` ఓటీటీ కోసం ఓ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు దీనిపై అల్లు అరవింద్‌ కూడా క్లారిటీ ఇచ్చాడు. 

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి స్టామినా ఏంటో దాదాపు తొమ్మిదేళ్ళ తర్వాత రీఎంట్రి ఇచ్చిన `ఖైదీ నెం.150`తో స్పష్టమైంది. ఎన్నేళ్ళు సినిమాలకు దూరంగా ఉన్నా, ఆయనపై ఫ్యాన్స్ లో అభిమానం ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు. మెగాస్టార్‌ అంటే ఎప్పటికీ మెగాస్టారే అనేది చాటి చెప్పింది. ఆ తర్వాత ఆయన ప్రతిష్టాత్మకంగా `సైరా నరసింహారెడ్డి`లో నటించారు. ఈ సినిమాలో ఎమోషన్స్ పండకపోవడం, ఇతర భాషల్లో అంతగా మార్కెట్‌ లేకపోవడంతో మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇప్పుడు సోషల్‌ మెసేజ్‌ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు చిరు. 

ఇదిలా ఉంటే ఇటీవల చిరంజీవి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అయిన `ఆహా` కోసం రంగంలోకి దిగబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆయన తన బావమరిది అల్లు అరవింద్‌ ప్రారంభించిన `ఆహా` ఓటీటీ కోసం ఓ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు దీనిపై అల్లు అరవింద్‌ కూడా క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ, `ఆహా` కోసం చిరంజీవితో చర్చలు జరుగుతున్నాయి. ఆయనకు కథ నచ్చితే చాలు చేస్తాడు` అని తెలిపారు. అంటే చిరు ఈ ఓటీటీ కోసం ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. 

అయితే ఇక్కడే అభిమానులను షాక్‌కి గురి చేస్తుంది. టాలీవుడ్‌ మెగాస్టర్‌ ఆయన. ఓటీటీ కోసం సినిమా చేయడమేంటనే వాదన కూడా వినిపిస్తుంది. ఇమేజ్‌లో హైలో ఉన్న చిరు ఓటీటీ కోసం సినిమా చేస్తే ఇమేజ్‌తోపాటు మార్కెట్‌ కూడా పడిపోతుందనే కామెంట్‌ వినిపిస్తుంది. ఓ వైపు యంగ్‌ హీరోలు పాన్‌ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న వేళ చిరు ఇలాంటి సాహసం చేయడం అభిమానులను ఇబ్బంది పెట్టే అంశమే. 

అయితే అల్లు అరవింద్‌ తన `ఆహా` ప్రమోషన్‌ కోసం చిరుని వాడుకోవాలనుకుంటున్నారు. అందుకే సినిమా చేయాలని భావిస్తున్నారు. అందుకోసం చిరు రంగంలోకి దిగుతాడా? ఆహా అంటాడా? అనేదే ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే నెటిజన్లు, ఆయన అభిమానుల నుంచి నెగటివ్‌ రియాక్షన్‌ వస్తోంది. అన్నీ కాదని అల్లు అరవింద్‌ కోసం తన ఇమేజ్‌నే తాకట్టు పెడతాడా? అని క్రిటిక్స్ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంలో చిరు ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. 

ప్రస్తుతం చిరు `ఆచార్య`లో నటిస్తుండగా, దీంతోపాటు మరో రెండు ప్రాజెక్ట్ లు సిద్ధంగా ఉన్నాయి. అందులో `లూసిఫర్‌` రీమేక్‌, బాబీ దర్శకత్వంలో ఓ సినిమా రెడీ ఉన్నాయి. ఈ నెల 22న చిరు బర్త్ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కొత్త సినిమాని ప్రకటించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇది కాదని తమిళ హిట్‌ `వేదాలం` చిత్ర రీమేక్‌ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని టాక్. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి