సిగ్గుగా ఉంది 'మా'లో ఉన్నవాళ్లు సోంబేరిలు అవ్వాలి: SPబాలసుబ్రహ్మణ్యం కామెంట్స్

Published : Mar 23, 2019, 04:27 PM ISTUpdated : Mar 23, 2019, 04:29 PM IST
సిగ్గుగా ఉంది 'మా'లో ఉన్నవాళ్లు సోంబేరిలు అవ్వాలి: SPబాలసుబ్రహ్మణ్యం కామెంట్స్

సారాంశం

సీనియర్ గాయకులు SP బాలసుబ్రహ్మణ్యం ఈటివల కాలంలో ఏం మాట్లాడినా సంచలనమే అవుతోంద. ఇక రీసెంట్ గా కొత్త అధ్యక్షుడు నరేష్ ఆధ్వర్యంలో మా అసోసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న గాన గంధర్వుడు తన అభిప్రాయాన్ని బలంగా చెప్పేశారు. 

'మా'కు సంబందించిన కార్యక్రమాల్లో ఇప్పటివరకు నేను పాల్గొనలేదు. అందుకు నిజంగా సిగ్గుగా ఉంది. ఇప్పటివరకు రానందుకు నన్ను క్షమించమని అడుగుతున్నా.. నేను మెంబర్ షీప్ కట్టానో లేదో కూడా తెలియదు. ఇక ఇప్పుడు కడతాను.. పెనాల్టీ తో సహా కట్టించుకోవాల్సిందిగా కోరుకుంటున్నా అని మా పరిస్థితి గురించి కొన్ని విషయాలు చెప్పారు. 

ఎన్నికలు ఫలితాలు ఏవైనా సరే అందరూ కలిసి కట్టుగా ఐకమత్యంతో ఉండాలని ఎవరికీ ఎలాంటి కష్టం రాకూడదని అంటూ.. సభ్యుల్లో అందరూ కూడా సోంబేరిలు అయిపోవాలని బాలు గారు సరదాగా కామెంట్ చేయడంతో అందరూ ఒక్కసారిగా నవ్వేశారు.

ఇక ఎప్పుడైనా ఎవరికైనా కొంత కష్టం వస్తే అందరూ ముందుండి నిలబడాలని ఒక సినీ ఇండస్ట్రీలో వ్యక్తిగా నేను కూడా సపోర్ట్ గా ఉంటానని అవసరమైతే సభ్యులు నన్ను డిమాండ్ చేయవచ్చని బాలు గారు వివరణ ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?
Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?