'మీటూ' పై షావుకారు జానకి కామెంట్స్!

Published : Dec 31, 2018, 05:22 PM IST
'మీటూ' పై షావుకారు జానకి కామెంట్స్!

సారాంశం

మీటూ ఆటోపణలు చేసిన వారికి ఎంతగా మద్దతు దక్కుతుందో అదే తరహాలో కొన్ని విమర్శలు కూడా అందుతున్నాయి. ఎప్పుడో జరిగిన విషయాలను ఇప్పుడు గుర్తు చేసి రచ్చ చేసుకోవడం ఏం లాభం అంటూ కామెంట్స్ కూడా వచ్చాయి. 

మీటూ ఆటోపణలు చేసిన వారికి ఎంతగా మద్దతు దక్కుతుందో అదే తరహాలో కొన్ని విమర్శలు కూడా అందుతున్నాయి. ఎప్పుడో జరిగిన విషయాలను ఇప్పుడు గుర్తు చేసి రచ్చ చేసుకోవడం ఏం లాభం అంటూ కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే అదే తరహాలో సీనియర్ నటి షావుకారు జానకి కూడా స్పందించడం మీడియాలో వైరల్ గా మారింది. 

గత కొంత కాలంగా సాగుతున్న మీటూ ఫైట్ ఏ విధంగా సంచలనాలు రేపిందో అందరికి తెలిసిందే. అయితే ఎప్పుడో జరిగిన విషయాలను ఇప్పుడు బయటపెట్టడం కరెక్ట్ కాదని.. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు అన్నిటికి అంగీకరించి.. లొంగిపోయి ఇప్పుడు ఆరోపణలు చేయడంసరైనది కాదని అన్నారు. అలాంటి వివాదాలతో ఇంట్లో పిల్లలకు బంధువులకు కూడా ఇబ్బందే కదా అని ఆమె వివరించారు. 

ఎక్కడో హాలీవుడ్ లో జరిగిన మీటూను చూసి ఇప్పుడు మన అమ్మాయిలు ఆరోపణలు చేస్తున్నారని చెప్పిన జానకి గారు తాను మహిళల హక్కుల కోసం పోరాడతాను కానీ ఇలాంటి మీటూ ఉద్యమం అర్ధం లేనిదని జానకి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

నారి నారి నడుమ మురారి ఫస్ట్ రివ్యూ, శర్వానంద్ సినిమాకు సెన్సార్ చిక్కులు, సినిమా ఎలా ఉందంటే?
డేటింగ్ యాప్ లో మొదటి అనుభవం, అతడితో 8 గంటలు గడిపా.. నటి బోల్డ్ కామెంట్స్ వైరల్