2019.. ఆసక్తి రేపుతోన్న చిత్రాలు!

By Udayavani DhuliFirst Published Dec 31, 2018, 4:16 PM IST
Highlights

ఎప్పటిలానే ఈ ఏడాదిలో కూడా సినిమాల సక్సెస్ రేట్ అంత ఆశాజనకంగా లేదనే చెప్పాలి. సినిమాలకు హిట్ టాక్ వస్తున్నా.. నిర్మాతలకు మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ రాక నష్టాలపాలైన సందర్భాలు చాలానే ఉన్నాయి. 

ఎప్పటిలానే ఈ ఏడాదిలో కూడా సినిమాల సక్సెస్ రేట్ అంత ఆశాజనకంగా లేదనే చెప్పాలి. సినిమాలకు హిట్ టాక్ వస్తున్నా.. నిర్మాతలకు మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ రాక నష్టాలపాలైన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఈ ఏడాది పూర్తయినట్లే.. ఇక ఆశలన్నీ వచ్చే ఏడాదిపైనే.. ఇప్పటికే కొన్ని చిత్రాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. అవేంటో ఒకసారి చూద్దాం..!

ఎన్టీఆర్ బయోపిక్: 


2019 ఆరంభంలో విడుదల కానున్న సినిమాల్లో ముందుగా ప్రేక్షకులను పలకరించనుంది 'ఎన్టీఆర్' బయోపిక్. ఈ సినిమా ట్రైలర్ తో ప్రేక్షకుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను క్రిష్ డైరెక్ట్ చేయడం, ఎన్టీఆర్ పాత్రని బాలయ్య పోషించడం వంటి విషయాలు బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. తెలుగు వాళ్ల దృష్టిలో దివంగత ఎన్టీఆర్ కి ఎంతటి ఫాలోయింగ్ ఉందో.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది ఆయన సినిమా అంటే జనాలు థియేటర్ల వద్ద క్యూ కట్టడం ఖాయం. మరి ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అవుతుందో చూడాలి!

సాహో: 


'బాహుబలి' సినిమా తరువాత ప్రభాస్ నటిస్తోన్న సినిమా కావడంతో 'సాహో' పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ ఏడాదిలో ప్రభాస్ నుండి ఒక్క సినిమా కూడా రాకపోవడంతో ఆయన అభిమానులు 'సాహో' కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సుజీత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా 2019 ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్ రేంజ్ లో 
యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళం ఇలా చాలా భాషల్లో సినిమాను విడుదల చేయబోతున్నారు. మరి ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ ఇంకెంత పెరుగుతుందో చూడాలి!
 
సై రా: 

'ఖైదీ నెంబర్ 150' చిత్రంతో రీఎంట్రీలో రికార్డులు సృష్టించిన మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా' పై అంచనాలు మాములుగా లేవు. మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా విడుదల చేసిన టీజర్ కూడా బాగుండడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా..? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోన్న 
ఈ సినిమాను మొదట 2019 ఆగస్ట్ లో విడుదల చేయాలనుకున్నారు. కానీ అది దసరాకి షిఫ్ట్ అయ్యే చాన్స్ ఉంది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, నయనతార, సుదీప్, విజయ్ సేతుపతి వంటి నటులు కనిపించబోతున్నారు. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. 

మహర్షి:


ఈ ఏడాదిలో 'భరత్ అనే నేను' సినిమాతో సక్సెస్ అందుకున్న మహేష్ వచ్చే ఏడాది 'మహర్షి' సినిమాతో మరో భారీ సక్సెస్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు. సామాజిక నేపధ్యంలో సాగే ఈ కమర్షియల్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి వేసవి సీజన్ ని ఈ సినిమా ఎంతవరకు క్యాష్ చేసుకుంటుందో చూడాలి! 

click me!