నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కు షాక్... నోటీసులిచ్చిన NIA, అరెస్ట్ తప్పదా..?

Published : Mar 13, 2024, 10:12 AM IST
నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కు షాక్... నోటీసులిచ్చిన NIA, అరెస్ట్ తప్పదా..?

సారాంశం

సౌత్ స్టార్ యాక్ట్రస్ వరలక్ష్మీ శరత్ కుమార్ కు షాక్ తగిలింది. డ్రగ్స్ కేసు విషయంలో కేంద్ర దర్యప్తు సంస్థ ఎన్ఐఏ నుంచి ఆమెకు నోటీసులు అందినట్టు తెలుస్తోంది.   

ప్రముఖ కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్‌కు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ కేసులో సంబంధమున్న ఆమె మాజీ పర్సనల్ అసిస్టెంట్ ని ప్రశ్నించేందుకు కొచ్చిలోని కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. ఆదిలింగం అనే వ్యక్తి వరలక్ష్మి శరత్ కుమార్ దగ్గర కొన్నాళ్లు పనిచేశాడు. డ్రగ్స్, ఆయుధాల సరఫరాలో అంతర్జాతీయ స్మగ్లర్లతో అతనికి సంబంధాలున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. దాంతో ఆ కేసులో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇబ్బందులు ఏదురుకోక తప్పడంలేదు. 

ఇక ఈ కేసుకు దర్యప్తులో భాగంగా జరిగిన సోదాలలో.. వరలక్ష్మి అసిస్టెంట్ ఆదిలింగం  వద్ద నుంచి రూ.2,100 కోట్ల విలువైన రూ.300 కేజీల హెరాయిన్, ఏకే 47 గన్, 9 ఎంఎం తుపాకులు, మందుగుండు సామాగ్రిని ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ నటుడు శరత్ కుమార్ కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమైన వరలక్ష్మి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తెలుగులో 'తెనాలి రామకృష్ణ బి.ఎ., బి.ఎల్', 'క్రాక్', 'నంది', 'వీరసింహా రెడ్డి' లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. తమిళ ఇండస్ట్రీలో కెరీర్ ను స్టార్ట్ చేసిన వరలక్ష్మి.. తెలుగుతో పాటు  తమిళం, కన్నడ, మలయాళంలో  బిజీ ఆర్టిస్ట్ గా ఉంది. 

ఇక రీసెంట్ గా ఆమె ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.  త్వరలో పెళ్లి చేసుకోబుతుండగా.. వరలక్ష్మీ ఇలా చిక్కుల్లో పడటం తో అంతా షాక్ అవుతున్నారు. ఇక  ఇక డ్రగ్స్ రాకేట్ కు సంబంధించి వివరాలు చూస్తే.. టాలీవుడ్‌లో 2017లో వెలుగు చూసింది డ్రగ్స్ రాకెట్. జాతీయ సంస్థ ఈ రాకెట్  గుట్టు రట్టు చేసిన సంగతి తెలిసిందే. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట పలువురు ప్రముఖులు హాజరయ్యారు. చిత్ర నిర్మాత పూరీ జగన్నాధ్, నటీమణులు ఛార్మీ కౌర్, రకుల్ ప్రీత్ సింగ్ మరియు మరికొంత మంది ప్రముఖులు కేంద్ర ఏజెన్సీ ముందు హాజరయ్యారు.

PREV
click me!

Recommended Stories

Sreemukhi Remuneration: శ్రీముఖి ఒక్క షోకి ఎంత రెమ్యునరేషన్‌ తీసుకుంటుందో తెలుసా? బుల్లితెర క్వీన్ అనేది ఇందుకే
Arya Underwater Stunt: హాలీవుడ్ రేంజ్ రిస్క్.. గడ్డకట్టే నీళ్ళల్లో 90 నిమిషాలు ఫైట్, సినిమా కోసం హీరో సాహసం