మాకు ఇలా జరిగి ఉండాల్సింది కాదు.. స్టార్ హీరో కూతురి ఆవేదన!

By AN TeluguFirst Published Sep 6, 2019, 2:14 PM IST
Highlights

సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్, ఆమె భర్త విశాకన్ లండన్ ఎయిర్‌పోర్ట్‌లో దోపిడీకి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన గురించి వివరిస్తూ ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
 

సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె సౌందర్య, ఆమె భర్త విషాగన్ తో కలిసి సెప్టెంబర్ 1న లండన్ వెళ్లారు. అయితే లండన్ ఎయిర్ పోర్ట్ లో వారు ప్రయత్నిస్తోన్న ఎమిరేట్స్ విమానం ల్యాండ్ అవ్వగానే విషాగన్ పాస్ పోర్ట్, అలానే వారు తీసుకొచ్చిన డబ్బు మిస్ అయింది.

ఈ విషయం గురించి తాజాగా సౌందర్య సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్స్ లో ప్రయాణికులకు ఎంతటి భద్రత ఉంది..? అంటూ ప్రశ్నించింది. లండన్ లోని హెత్రో ఎయిర్ పోర్ట్ లో తమ సామాన్లు, పాస్ పోర్ట్ పోయినట్లు చెప్పింది సౌందర్య. వెంటనే లోకల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు.. వారు విషయం తెలుసుకొని ఈమెయిల్ ద్వారా వివరాలు చెబుతామని తెలిపినట్లు వెల్లడించింది.

కాసేపటికే ఈమెయిల్ వచ్చిందని.. దోపిడీ జరిగిన సమయంలో ఎయిర్ పోర్ట్ లో ఉన్న సీసీటీవీ కెమెరాలు పని చేయలేదని.. దాంతో అక్కడే ఏం జరిగిందో రికార్డ్ అవ్వలేదని..  పోలీసులు మెయిల్ చేసినట్లు చెప్పింది. ఎయిర్ పోర్ట్ లో అధికారులు కాస్త బాధ్యత కూడా లేకుండా వ్యవహరిస్తారని తాను అనుకోలేదని.. ఎయిర్ పోర్ట్ లో భద్రత అనేది ఎక్కడ ఉందంటూ ప్రశించింది. 

''మాకు జరిగిన ఘటనలకు ఎయిర్‌పోర్ట్ సిబ్బందే బాధ్యులు. మాకుఇలా జరిగి ఉండాల్సింది కాదు. మాకే కాదు మరెవ్వరికీ ఇలాంటి అనుభవాలు ఎదురుకాకూడదు'' అంటూ చెప్పుకొచ్చింది. 

 

👇🏻 https://t.co/DMV9BOZRZC

— soundarya rajnikanth (@soundaryaarajni)

రజనీ కూతురు, అల్లుడి పాస్‌పోర్ట్ చోరీ: లండన్‌ ఎయిర్‌పోర్టులో నిలిపివేత 

click me!