నా కొడుకు వచ్చే వరకు తాళికట్టనన్నారు.. భర్తపై సౌందర్య కామెంట్స్!

Published : Apr 15, 2019, 04:03 PM IST
నా కొడుకు వచ్చే వరకు తాళికట్టనన్నారు.. భర్తపై సౌందర్య కామెంట్స్!

సారాంశం

సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె సౌందర్య ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త విషాగన్ వనగమూడిని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 

సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె సౌందర్య ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త విషాగన్ వనగమూడిని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె తన భర్త, కుమారుడు వేద్ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ఆమె మాట్లాడుతూ.. ''నా కుమారుడు వేద్ కు విషాగన్ ఫోటో చూపించి ఇదిగో డాడీ అనే చెప్పాను. ఆయన ఫోటో చూసి వేద్ చాలా సంతోషపడ్డాడు. మొదటిసారి చూసినప్పుడే వేద్ కి విషాగన్ నచ్చారు'' అంటూ చెప్పుకొచ్చింది. 

వేద్ విషయంలో విషాగన్ కి ఓపిక చాలా ఎక్కువ అని చెప్పింది. పెళ్లి  ముహూర్తం దగ్గరపడుతున్న సమయంలో వేద్ ని ఇంకా పెళ్లి మండపానికి తీసుకురాలేదట. ఆ సమయంలో వేద్ పెళ్లి చూస్తాడో లేదో అని సౌందర్య చాలా టెన్షన్ పడిందట. అప్పుడు విషాగన్ ఆమెకి ధైర్యం చెప్పినట్లు.. వేద్ వచ్చేవరకు తాళికట్టనన్నారు అంటూ గుర్తు చేసుకుంది.

విషాగన్ వద్ద వేద్ సురక్షితంగా ఉంటాడని, తనకు కావాల్సింది కూడా అదేనని చెప్పుకొచ్చింది. నిజానికి పెళ్లికి ముందుకు విషాగన్.. వేద్ దగ్గరకి వెళ్లి 'మీ అమ్మని పెళ్లి చేసుకుంటా.. నీకు ఇష్టమేనా..?' అని అనుమతి తీసుకున్నట్లు సౌందర్య వెల్లడించింది. దానికి సంబంధించిన వీడియో కూడా తనవద్ద ఉందని, వేద్ కి 18 ఏళ్లు వచ్చిన తరువాత ఆ వీడియో చూపిస్తానని అన్నారు.  

PREV
click me!

Recommended Stories

Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే
Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌