జయలలితపై మరో బయోపిక్..?

Published : Apr 15, 2019, 03:31 PM IST
జయలలితపై మరో బయోపిక్..?

సారాంశం

జయ జీవితాన్ని తెరకెక్కించేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. అయితే ఎవరు ఈ కథను కరెక్ట్ గా తెరకెక్కిస్తారు అనే విషయాన్నీ పక్కనపెడితే స్టార్ హీరోయిన్స్ ఈ బయోపిక్ లో నటించడానికి ఒప్పుకోవడం గమనార్హం. 

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించిన అనంతరం అక్కడ రాజకీయాలు ఏ విధంగా మారాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడు జయ జీవితాన్ని తెరకెక్కించేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. అయితే ఎవరు ఈ కథను కరెక్ట్ గా తెరకెక్కిస్తారు అనే విషయాన్నీ పక్కనపెడితే స్టార్ హీరోయిన్స్ ఈ బయోపిక్ లో నటించడానికి ఒప్పుకోవడం గమనార్హం. 

ఇప్పటికే నిత్యా మీనన్ - కంగనా రనౌత్ - రమ్యకృష్ణ వంటి స్టార్ హీరోయిన్స్ జయలలిత బయోపిక్ లో నటించడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ కూడా అమ్మ పాత్రలో నటించడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. తమిళనాడు తెలుగు యువశక్తి లీడర్ జగదీశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఆ సినిమా మరికొన్ని రోజుల్లో మొదలుకానుందట. 

అయితే జయలలిత పాత్ర కోసం కాజోల్ నిజంగా ఒప్పుకుందా లేదా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.  వీటన్నిటిలో జనాలను ఎక్కువగా కంగనా నటిస్తోన్న బయోపిక్కే ఆకర్షించేలా ఉంది. ప్రముఖ దర్శకుడు ఏఎల్.విజయ్ ఆ సినిమాను దాదాపు 70 కోట్ల బడ్జెట్ తో తెలుగు తమిళ్ హిందీ భాషల్లో నిర్మిస్తున్నాడు. మరి వీటన్నిటిలో ఏ సినిమా ఎక్కువగా ఆకట్టుకుంటుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?