పవన్ గురించి అకిరా చెప్పింది నిజం కాదా..?

Published : Apr 15, 2019, 03:40 PM IST
పవన్ గురించి అకిరా చెప్పింది నిజం కాదా..?

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకి సంబంధించిన ప్రతి విషయం వైరల్ అవుతుంటుంది. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకి సంబంధించిన ప్రతి విషయం వైరల్ అవుతుంటుంది. రాజకీయాలు, వ్యక్తిగత విషయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటే ఉంటాడు పవన్.

ఇటీవల పవన్ కి ఆరోగ్యం పాడైనప్పటికీ ఎన్నికల కోసం ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో పవన్ కుమారుడు అకిరా నందన్ సోషల్ మీడియాలో ప్రజల కోసం తన తండ్రి రక్తం చిందిస్తున్నాడని ఎమోషనల్ గా పోస్ట్ లు పెట్టాడు. దీంతో ఆ విషయం బాగా వైరల్ అయింది.

చాలా మంది అకిరా పోస్ట్ ని షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే అసలు అకిరాకి ఎలాంటి సోషల్ మీడియా ఖాతాలు లేవని అంటోంది అతడి తల్లి రేణుదేశాయ్. అకిరా ఫేస్ బుక్ పేజీకి రెండు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. పవన్ గురించి పోస్ట్ లు పెట్టడంతో అకిరానే అని అంతా అనుకున్నారు.

కానీ అకిరా పేరు మీదున్న ఖాతాలన్నీ అభిమానులు ఓపెన్ చేసినవేనని క్లారిటీ ఇచ్చింది రేణుదేశాయ్. అకిరా గురించి తనకుపవన్ కళ్యాణ్ అభిమానులు  మెసేజ్ లు పెడుతుంటారని, పవన్ వారసుడిగా అకిరా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని కోరుతున్నారని రేణు   చెప్పుకొచ్చింది. 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?