క్షమించమని కోరిన కార్తికేయ..ఎందుకంటే

Surya Prakash   | Asianet News
Published : Mar 29, 2021, 12:46 PM ISTUpdated : Mar 29, 2021, 12:51 PM IST
క్షమించమని కోరిన కార్తికేయ..ఎందుకంటే

సారాంశం

యంగ్ హీరో కార్తికేయ నటించిన తాజా చిత్రం ‘చావు కబురు చల్లగా’. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ద్వారా కౌశిక్‌ పెగళ్లపాటి డైరక్టర్ గా పరిచయం అయ్యారు.  సినిమా విడుదలకు ముందు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమా పైన ఆసక్తిని పెంచాయి. గీతా ఆర్ట్స్‌ 2 పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పించారు.  ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  

 అయితే మార్నింగ్ షోకే సినిమా ఫ్లాఫ్ టాక్ ని మూట కట్టుకుంది. బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయ, మల్లిగా లావణ్య ఆకట్టుకుంటున్నారని అని అన్నారు. కానీ వీకెండ్ లో కూడా కలెక్షన్స్ పుంజుకోలేదు. ఆ తర్వాత మొత్తానికి ఆ సినిమా డిజాస్టర్ గా తేలింది. ఈ నేపధ్యంలో హీరో కార్తికేయ... ఓ స్టేట్మెంట్ ని ట్విట్టర్ లో పెట్టారు.  చావు కబురు చల్లగా తనలోని నటుడుని ఎక్సప్లోర్ చేసిందని అన్నారు, అయితే సినిమా నచ్చని అందరూ చిన్న తప్పులుని క్షమించేసి,ఇంకా ఛాన్స్ ఇవ్వమనికోరాడు. 

ఇక చావు కుబురు చల్లగా కలెక్షన్స్ కూడా దారుణంగానే వచ్చాయి. 3 రోజులకే చావు కబురు చల్లగా ఫుల్ రన్ కంప్లీట్ అయిపోయింది. 13 కోట్ల బిజినెస్ చేసిన చావు కబురు చల్లగా 3 కోట్ల దగ్గరే తన ప్రయాణం ముగించింది. గీతా ఆర్ట్స్ 2లో తొలి డిజాస్టర్‌గా నిలిచింది చావు కబురు చల్లగా. ఈ సినిమాకు క్లోజింగ్ కలెక్షన్స్ ఏంటో చూద్దాం..

నైజాం- 1.19 కోట్లు

సీడెడ్- 0.55 కోట్లు
ఉత్తరాంధ్ర- 0.36 కోట్లు
ఈస్ట్- 0.23 కోట్లు
వెస్ట్- 0.14 కోట్లు
గుంటూరు- 0.23 కోట్లు
కృష్ణా- 0.25 కోట్లు
నెల్లూరు- 0.13 కోట్లు

ఏపీ + తెలంగాణ క్లోజింగ్ కలెక్షన్స్- 3.08 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- 0.09 కోట్లు
ఓవర్సీస్- 0.15 కోట్లు
వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్- 3.32 కోట్లు
 
PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?