ఇప్పటిదాకా ఈ సినిమా కు బీబీ3 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఇప్పటికే పలు రకాల టైటిల్స్ తెరపైకి వచ్చాయి. ఈ సినిమాకు ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఉగాదికు ఈ సినిమా టైటిల్ ఎనౌన్సమెంట్ జరగనుందని వినపడుతోంది.
సాధారణంగా బాలయ్య సినిమా అంటే టైటిల్, డైలాగులు రెండూ పవర్ ఫుల్ గా ఉండాల్సిందే. అందులోనూ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే మరీను. మాస్ సినిమాల డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఆయన ముచ్చటగా మూడో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తొలి రెండు సినిమాలు 'సింహా', 'లెజెండ్'.. ఒకదాన్ని మించి మరొకటి భారీ విజయం సాధించడంతో ఈ బీబీ3 మూవీపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ మూవీతో వారు హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని బాలయ్య ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ వచ్చి ఏడాది కావొస్తోంది. మొదటి టీజర్ కూడా వచ్చింది.
కానీ ఇప్పటివరకు టైటిల్ ప్రకటించలేదు. మరో రెండు నెలల్లోనే సినిమా విడుదల. ఇప్పటిదాకా ఈ సినిమా కు బీబీ3 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఇప్పటికే పలు రకాల టైటిల్స్ తెరపైకి వచ్చాయి. ఈ సినిమాకు ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఉగాదికు ఈ సినిమా టైటిల్ ఎనౌన్సమెంట్ జరగనుందని వినపడుతోంది. అంతేకాదు ఈ టైటిల్ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా రివీల్ చేయనున్నారట. ఈ మేరకు ఎన్టీఆర్ ఓకే చేసారని చెప్పుకుంటున్నారు. అయితే అందులో ఎంత నిజముందనేది తెలియాల్సి ఉంది. గతంలో ఎన్టీఆర్, బోయపాటి కాంబినేషన్ లో దమ్ము చిత్రం వచ్చింది.
డైరక్టర్ బోయపాటి ఇప్పటికే ఈ సినిమా టైటిల్ లోగో రెడీ చేసి,బాలయ్యకు పంపారట. బాలయ్య నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఎనౌన్సమెంట్ వచ్చేస్తుందంటున్నారు. ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకుందట. అందులో భాగంగా స్ట్రీమింగ్ రైట్స్ కోసం అమెజాన్ ఏకంగా 10 కోట్ల రూపాయలకు డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయాయని సమాచారం.
ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందరెడ్డి దీనిని నిర్మిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకొంది. ప్రస్తుతం క్లైమాక్స్ సీన్ల షూటింగ్ జరుగుతోంది. బాలయ్య ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపిస్తాడు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. తమన్ దీనికి సంగీత స్వరాలు సమకూరస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి డ్యూయల్ రోల్లో కవల సోదరులుగా నటిస్తున్నాడు. అంతేకాదు ఒకటి అఘోర పాత్ర అయితే.. మరొకటి కలెక్టర్ పాత్ర అని చెబుతున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు ఢీ కొట్టే విలన్ పాత్రలో శ్రీకాంత్ నటిస్తున్నాడు. ఈ సినిమా క్లైమాక్స్‌ను కర్ణాటకలోని దండేలి అభయారణ్యంలో పిక్చరైజ్ చేస్తున్నాడు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు ఈ సినిమా క్లైమాక్స్ కంప్లీట్ చేసే దిశగా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. సినిమా వేసవి వినోదంగా మే 28న రిలీజ్ కానున్నది.