మరో సినిమాకి కమిటైన `ఉప్పెన` సెన్సేషన్‌ వైష్ణవ్‌ తేజ్‌.. `అర్జున్‌రెడ్డి` రీమేక్‌ డైరెక్టర్‌తో..?

Published : Mar 29, 2021, 10:16 AM IST
మరో సినిమాకి కమిటైన `ఉప్పెన` సెన్సేషన్‌ వైష్ణవ్‌ తేజ్‌.. `అర్జున్‌రెడ్డి` రీమేక్‌ డైరెక్టర్‌తో..?

సారాంశం

వైష్ణవ్‌ తేజ్‌ క్రిష్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు. ఇది చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇందులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌. ఈ సినిమా కూడా ఇంకా విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో మరో సినిమాకి కమిట్‌ అయ్యాడట వైష్ణవ్‌ తేజ. 

`ఉప్పెన` సినిమాతో సెన్సేషనల్‌ స్టార్‌ అయ్యాడు మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌. ఈ సినిమాతోనే వందకోట్లు కలెక్ట్ చేసిన డెబ్యూ హీరోగా టాలీవుడ్‌ చరిత్రలో సరికొత్త రికార్డ్ క్రియేట్‌ చేశారు. ఈ సినిమా విడుదలకు ముందే ఆయన క్రిష్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు. ఇది చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇందులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌. ఈ సినిమా కూడా ఇంకా విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో మరో సినిమాకి కమిట్‌ అయ్యాడట వైష్ణవ్‌ తేజ. 

`అర్జున్‌రెడ్డి` డైరెక్టర్‌ సందీప్‌రెడ్డి వంగా అసిస్టెంట్‌ గిరీశయ్య దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడట. ఈయన గతంలో తమిళంలో `అర్జున్‌రెడ్డి` రీమేక్‌ని రూపొందించారు.  ప్రముఖ నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఇందులో ముంబయి మోడల్‌ కేతికా శర్మని హీరోయిన్‌గా ఎంపిక చేశారని తెలుస్తుంది. ఏప్రిల్‌ నుంచి ఈ సినిమా స్టార్ట్ కానుందట. ఇదిలా ఉంటే వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో ఓ నూతన దర్శకుడితో సినిమా చేయబోతున్నట్టు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌