చంద్రబాబుతో  మోహన్ బాబు... వైరల్ గా త్రోబ్యాక్ పిక్!

Published : Sep 09, 2021, 04:16 PM IST
చంద్రబాబుతో  మోహన్ బాబు... వైరల్ గా త్రోబ్యాక్ పిక్!

సారాంశం

2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు తన విద్యా సంస్థకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు బకాయిల విషయంలో చంద్రబాబుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు,దీక్షలు కూడా చేయడం జరిగింది. అయితే ఒకప్పుడు వీరిద్దరూ మంచి మిత్రులు.

మంచు మోహన్ బాబు ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు తన విద్యా సంస్థకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు బకాయిల విషయంలో చంద్రబాబుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు,దీక్షలు కూడా చేయడం జరిగింది. అయితే ఒకప్పుడు వీరిద్దరూ మంచి మిత్రులు. 


మోహన్ బాబు అన్నగా పిలుచుకునే స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో మోహన్ బాబు కూడా కీలక నేతగా ఉన్నారు. పార్టీ స్థాపన సభ్యులలో ఒకరిగా ఉన్న మోహన్ బాబు టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యునిగా 1995లో పార్లమెంట్ కి వెళ్లారు. 
ఆ తరువాత సినిమాలపై ఫోకస్ పెట్టిన మోహన్ బాబు పెద్దగా టీడీపీ వ్యవహారాలలో కనిపించలేదు. 

అయితే గతంలో చంద్రబాబు, మోహన్ బాబు మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆ చనువుతోనే 1993లో మోహన్ బాబు తిరుపతిలో స్థాపించిన విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ స్వాతంత్ర్య వేడుకలకు చంద్రబాబును గెస్ట్ గా పిలిచారు. ఆ సమయంలో వీరు దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే