అనాథ పిల్లల కోసం సోనూ సూద్ కీలక నిర్ణయం.. ఇంటర్నేషనల్ స్కూల్ ను ఏర్పాటు చేయబోతున్న రియల్ హీరో

By Asianet News  |  First Published May 29, 2023, 5:16 PM IST

రియల్ హీరో సోనూసూద్ సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. తాజాగా బిహార్ లోని నిరుపేద పిల్లల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
 


రియల్ హీరో సోనూసూద్ (Sonu Sood) పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. కరోనా పరిస్థితుల్లో ఆయన చేసిన సేవకు దేశ ప్రజలు ప్రశంసలు కురిపించారు. అప్పటితో ఆగకుండా సేవా కార్యక్రమాలను నిర్విరామంగా కొనసాగిస్తుండటంతో సోనూ సూద్ ను గుండెల్లో పెట్టుకున్నారు. ముఖ్యంగా నార్త్ లో ఆయన్ని ఓ దైవంలా పూజిస్తున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను, పేదల కష్టాలను ఎప్పటికప్పుడు తీర్చుతూనే ఉన్నారు. నిర్విరామంగా సేవన చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

అయితే, బిహార్‌లోని నిరుపేద పిల్లల కోసం సోనూ సూద్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. ఈక్రమంలో అనాథ పిల్లల కోసం పాఠశాల ప్రారంభించిన కతిహార్ ఇంజనీర్‌ను తాజాగా కలిశారు. ఆ స్కూల్ కు సోనూ సూద్ పేరు పెట్టారు. సూద్ నిరుపేద పిల్లలకు కొత్త భవనం, ఉన్నత విద్యను అందించనున్నారని ఈ సందర్భంగా ప్రకటించారు. 

Latest Videos

అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో 27 ఏళ్ల బీహార్ ఇంజనీర్ బీరేంద్ర కుమార్ మహ తన ఉద్యోగం విడిచి, అనాథ పిల్లల కోసం పాఠశాలను ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న సోనూ సూద్ ఆశ్చర్యపోయారు. 110 మంది పిల్లలకు ఉచిత విద్య , ఆహారాన్ని అందించడానికి మహతో కృషి చేస్తున్నారు.  విషయం తెలసుకున్న సోనూ సూద్ మహతోపాటు పిల్లలను, స్కూల్ ను సందర్శించారు. రేషన్, నాణ్యమైన విద్య , ధనిక  మరియు పేదల మధ్య విద్య అంతరాన్ని తగ్గించే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సోనూ సూద్ పాఠశాల కోసం కొత్త భవనాన్ని నిర్మిస్తున్నట్టు తెలిపారు. తద్వారా మరింత నిరుపేద పిల్లలకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.  

పేదరికాన్ని ఎదుర్కోవడానికి విద్య  ప్రాధాన్యతను పెంచడం ఉత్తమ మార్గాలలో ఒకటన్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాల పిల్లలకు ఉద్యోగావకాశాలలో మెరుగైన అవకాశాలు ఉండేలా చేయాలంటే విద్యావంతులను చేయడమే లక్ష్యమన్నారు. ఇక ప్రస్తుతం సోనూ సూద్ దేశవ్యాప్తంగా దాదాపు పది వేల మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు.

 

click me!