గోపీచంద్ తో రొమాన్స్ చేయబోతున్న రవితేజ హీరోయిన్

By Mahesh Jujjuri  |  First Published May 29, 2023, 4:43 PM IST

పాపం గోపిచంద్‌ హిట్టు  ముఖం చూసి చాలా కాలం అయ్యింది. దాదాపు తొమ్మిదేళ్ల నుంచి గోపీచంద్ కు సరైన సినిమా పడలేదు. ఎప్పుడో  లౌక్యం తర్వాత ఇప్పటి వరకు గోపిచంద్‌కు సరైన సక్సెస్ లేదు. 



పాపం గోపిచంద్‌ హిట్టు  ముఖం చూసి చాలా కాలం అయ్యింది. దాదాపు తొమ్మిదేళ్ల నుంచి గోపీచంద్ కు సరైన సినిమా పడలేదు. ఎప్పుడో  లౌక్యం తర్వాత ఇప్పటి వరకు గోపిచంద్‌కు సరైన సక్సెస్ లేదు. . మధ్యలో మధ్యలో ఎన్నో సినిమాలు చేసినా..  గౌతమ్‌ నందా, సీటీమార్‌  సినిమాలు మాత్రమే పర్వాలేదు అనిపించాయి కాని కమర్షియల్ గా.. కలెక్షన్స్ పరంగా మాత్రం ఏమాత్రం ప్రభావం  చూపించలేకపోయాయి. 

గోపీచంద్ ఎన్ని ప్రయోగాలు చేసినా.. పెద్దగా ఫలితం లేకుండా పోయింది. డిఫరెంట్ గెటప్స్.. డిఫరెంట్ స్టోరీస్ ను సెలక్ట్ చేసుకుని మరీ సినిమాలు చేస్తూ వస్తున్నాడు గోపీచంద్. ఇక తాజాగా రామబాణం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు గోపీచంద్. కాని ఏం లాభం లేకుండా పోయింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈసినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డేనే బోల్తా కొట్టింది. నెగెటీవ్ టాక్ తో ఉసూరుమనిపించింది. ఇక గోపీచంద్ కు  కెరీర్‌లో రెండు భారీ సక్సెస్ లు ఇచ్చిన డైరెక్టర్  శ్రీవాస్‌ కూడా ఈసారి ఈ హీరోను కాపాడలేదకపోయాడు. 

Latest Videos

ఇక కెరీర్ లో మంచి బ్రేక్ కోసం చూస్తున్నాడు గోపీచంద్.  సాలిడ్‌ కంబ్యాక్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. కాగా గోపీచంద్ తన నెక్ట్స్ మూవీని  హర్ష దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇప్పటకే ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇక అతి త్వరలో ఈసినిమా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈసినిమాలో హీరోయిన్ కూడా సెట్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో గోపిచంద్‌కు జోడీగా మాళవికా శర్మ నటించనున్నట్లు సమాచారం. నేలటిక్కెట్‌, రెడ్‌ లాంటి సినిమాల్లో నటించిన మాళవిక ఈ రెండు సినిమాలతో టాలీవుడ్ లో ప్లాప్ ను ఫేస్ చేసింది. 

దాంతో తెలుగులో ఇంక అవకాశాలు రాలేదు మాళవికకు. ఇక బాలీవుడ్ లో ప్రయత్నాులు చేస్తుండగా.. సల్మాన్ తో నటించే అవకావం వచ్చింది బ్యూటీకి.  రీసెంట్ గా సల్మాన్ ఖాన్ మూవీ  కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌ సినిమాలో కీలకపాత్ర పోషించింది. ఈ బ్యూటీ ప్రస్తుతం గోపీచంద్ తో నటించబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో గోపిచంద్‌ మరోసారి పోలీస్‌ అధిహిట్ అవ్వకారిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.  గోపిచంద్‌ పోలీస్‌ క్యారెక్టర్‌ చేసిన సినిమాలన్నీ బ్లాక్‌ బస్టర్‌ విజయాలు సాధించాయి. దాంతో తనకు అచ్చొచ్చిన పోలీస్‌ క్యారెక్టర్‌ను ఈసారి నమ్ముకున్నట్లు సమాచారం. 

click me!